More

    లాథమ్, విలియమ్సన్ దంచేశారు.. భారత్ ఓటమి

    తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ పై కివీస్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. 307 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. కివీస్ వికెట్ కీపర్ టామ్ లాథమ్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ లు చెలరేగడంతో భారత బౌలర్లు తేలిపోయారు. లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులతో అద్భుత సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టాడు. అర్షదీప్ సింగ్ 8.1 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లకు కూడా పిచ్ సహకరించలేదు. చహల్ 10 ఓవర్లలో 67 పరుగులు ఇచ్చాడు.

    ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (80), కెప్టెన్ శిఖర్ ధావన్ (72), శుభ్ మాన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించగా, వాషింగ్టన్ సుందర్ (37 నాటౌట్), సంజు శాంసన్ (36) ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 3, సౌథీ 3, మిల్నే 1 వికెట్ తీశారు. ఈ విజయంలో మూడు వన్డేల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0తో ముందంజ వేసింది. ఆదివారం రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి.

    Trending Stories

    Related Stories