More

    నటి సోనమ్ కపూర్ ఇంట్లో 2.4 కోట్ల దొంగతనం.. ఎవరిని అరెస్ట్ చేశారంటే

    ఢిల్లీలోని నటి సోనమ్ కపూర్ ఇంట్లో పనిచేస్తున్న ఒక నర్సు, తన భర్తతో కలిసి దొంగతనానికి పాల్పడింది. ఫిబ్రవరిలో అమృతా షెర్గిల్ మార్గ్‌లోని సోనమ్ కపూర్ భర్త ఇంట్లోంచి రూ. 2.4 కోట్ల విలువైన నగదు, నగలను దొంగిలించిన ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు అపర్ణా రూత్ విల్సన్, సోనమ్ అత్తగారిని చూసుకునేవారని.. విల్సన్ భర్త నరేష్ కుమార్ సాగర్ షకర్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 11న చోరీ జరిగిందని, 12 రోజుల తర్వాత ఫిబ్రవరి 23న తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా ఇంటి మేనేజర్ చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. ఆ ఇంటిలో 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సోనమ్ ఇంట్లో నగదు, నగలు దొంగిలించిన కేసులో నిందితులుగా ఉన్న భార్యాభర్తలను ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.

    “ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, న్యూ ఢిల్లీ జిల్లా స్పెషల్ స్టాఫ్ బ్రాంచ్ బృందం మంగళవారం రాత్రి సరితా విహార్‌లో విల్సన్, ఆమె భర్తను పట్టుకున్నారు, ఇద్దరికీ 31 సంవత్సరాలు” అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. చోరీకి గురైన నగలు, నగదు ఇంకా రికవరీ కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమృత షెర్గిల్ మార్గ్‌లోని సోనమ్ కపూర్ ఇంట్లో పనిచేస్తున్న చాలా మంది వ్యక్తులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. అంతకుముందు, క్రైమ్ బ్రాంచ్ కూడా ఈ విషయాన్ని విచారించింది. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ ఈ కేసును దర్యాప్తు కోసం న్యూఢిల్లీ జిల్లా స్పెషల్ స్టాఫ్ బ్రాంచ్‌కు బదిలీ చేసింది.

    సోనమ్ కపూర్ ఢిల్లీ నివాసంలో చోరీ

    నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఢిల్లీ నివాసంలో కనీసం రూ. 1.41 కోట్ల విలువైన వస్తువులు దోచుకున్నట్లు వార్తలు వచ్చాయి. సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహుజా అమ్మమ్మ సరళా అహూజా దొంగతనం గురించి మొదటగా తెలుసుకున్నారని పింక్‌విల్లా నివేదించింది. ఫిబ్రవరి 11న, సరళా అహుజా తన అల్మారాలను తనిఖీ చేయగా, ఆమె నగలు, నగదు కనిపించలేదు. దొంగతనంపై ఫిర్యాదు చేసేందుకు ఫిబ్రవరి 23న ఆమె పోలీసులను ఆశ్రయించారు. రెండేళ్ల క్రితం తాను ఆభరణాలను చివరిసారిగా చూశానని సరళా అహుజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఈ కేసులో అనుమానితులను గుర్తించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సోనమ్ బావ హరీష్ అహుజా, అత్తగారు ప్రియా అహుజా అమృత షెర్గిల్ మార్గ్‌లోని ఢిల్లీ నివాసంలో ఆనంద్ అమ్మమ్మ సరళా అహుజాతో కలిసి నివసిస్తున్నారు.

    Trending Stories

    Related Stories