National

నుపుర్ శర్మపై సుప్రీం షాకింగ్ తీర్పు..! మరీ.. అక్బరుద్దీన్, మౌల్వీలకు వర్తించదా..?

చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు.. రాజ్యాంగం అందరికి సమానం. అందులోనూ భారత్‎లో పౌరులందరికి సమాన హక్కులు వర్తిస్తాయి. అయితే ఉదయ్ పూర్ లో టైలర్ హత్యకు నుపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశ ప్రజలకు నుపుర్ శర్మ మీడియా ముందు క్షమాపణలు చెప్పాలని తీర్పునిచ్చింది.

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పింది. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నుపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు సమంజసమే. దైవ దూషణ కింద నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాల్సిందే. కానీ ఇదే తీర్పు మిగతా వారికి కూడా వర్తించాల్సిన అవసరం ఉంది. దైవాన్ని దూషించిన ప్రతి ఒక్కరికి ఇలాంటి శిక్షలు పడాలి కదా..? మరి ఎందుకు పడటం లేదు..?

తనకు ఉన్న ప్రాణహాని, అత్యాచార బెదిరింపులు వస్తున్నందున దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ శర్మ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ బహిష్కృత నేతపై సుప్రీంకోర్టు మండిపడింది. నుపుర్ శర్మ నోటి దురుసు.. దేశాన్ని రావణ కాష్టంలా మార్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలే ఉదయ్‌పుర్ ఘటనకు కారణమని జ‌స్టిస్ సూర్య కాంత్ త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డ్డారు.. నుపుర్ శర్మ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప, టీవీ ఛానల్, నుపుర్ శర్మల డిబేట్‌ వల్ల దేశానికి ఒరిగిందేంటి.? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై నుపుర్ శర్మ తరఫు లాయర్ మణిందర్ సింగ్ స్పందిస్తూ ఆమెకు ప్రాణహాని ఉందని ధర్మాసనానికి తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయితే దీనిపై కూడా సుప్రీం కోర్టు ఫైర్ అయింది. అయితే ఆమె అదే టీవీ ముందుకు వచ్చి యావత్‌ దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉందని.. కానీ అప్పటికే ఆలస్యం అయ్యిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆమె ప్రాణానికి ముప్పు ఏర్పడిందా? ఆమె వల్ల దేశం రగిలిపోతోందంటూ మండిపడింది. దేశమంతటా భావోద్వేగాలను ఆమె రగిలించిన విధానం, దేశంలో జరుగుతున్న ఘటనలకు ఆమెదే బాధ్యత అంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నుపుర్ శర్మపై ఫిర్యాదు నమోదై ఇన్ని రోజులు అవుతుంటే దిల్లీ పోలీసులు ఏం చేశారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆమె ఫిర్యాదు మీద ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు కానీ… ఆమెపై ఎన్నో ఎఫ్‌ఐఆర్‌లు అందినా ఎందుకు ఆమెను టచ్‌ చేయలేకపోయారని సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.

అయితే విద్వేషపూరిత వ్యాఖ్యలు, దైవ దూషణలు చేసిన వారిపై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. మరి పోలీసులు 15 నిమిషాలు మౌనంగా ఉంటే దేశంలో ముస్లింలా సత్తా చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీని ఏం చేయాలి..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నుపుర్ శర్మ విషయంలో సుప్రీం తీర్పును సమర్ధిస్తూనే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను జోడిస్తున్నారు. పావుగంట సమయం ఇస్తే హిందువుల అంతు చూస్తామంటూ గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. దీనిపై అప్పట్లో పెను దుమారం రేగింది. పలు ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత నాంపల్లి కోర్టు ఆయనపై నమోదు అయిన కేసును కొట్టివేసింది. ఇక ఓ టీవీ ఛానల్ చర్చలో మౌల్వీ ఇలియాస్ ఫక్రుద్దిన్ శివలింగాన్ని పురుషాంగంతో పోల్చారు. ఇది కూడా పెనుదుమారం రేపింది. దీనిపై దేశ వ్యాప్తంగా హిందువులు ఆందోళన బాట పట్టారు. తమ దైవాన్ని దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

20 + 8 =

Back to top button