Editorial

నుపుర్ శర్మ ఎపిసోడ్ లో ఫ్యాక్ట్ చెక్స్..!

అపరాధభావం మచ్చుకైనా లేకుండా ఉదారవాదులుగా ఎలా మనగలుగుతారు. ఇస్లామో ఫాసిస్టులు, ఆ ఫాసిస్టుల సైద్ధాంతిక సహచరులు కొరివితో తల గోక్కున్న ఉదారవాదులు.

గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్న గోముఖ వ్యాఘ్రాలు. ద్వేషపూరిత ప్రసంగాలు, మరణ బెదిరింపులు, జుగుప్సాకర ట్వీట్లు, సోషల్ మీడియాలో యాంటి సోషల్ ఎలిమెంట్ కామెంట్లు…ఇదీ సదరు ఉదారవాదుల ఉదారబుద్ధి అని నెట్టింటా, అన్నింటా స్ట్రాంగ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

తప్పే చేశారో, ఒప్పే చేశారో.. నుపుర్ శర్మ ఏవో కామెంట్లు చేసేశారు. దీనిపై కొందరు అసహనం వ్యక్తం చేశారు. మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె పార్టీ అధిష్ఠానం..ఆమె తీరుపై చర్యలు తీసుకుంది. ఈ విషయంలో.. కొందరు ముస్లిం దేశాల నేతలే..కేంద్ర సర్కారు తీరును అభినందించారు. కేంద్రం తీరుపై ముస్లిం సోదరులు సంతృప్తి చెందారని, వ్యక్తి నిందను పార్టీకి, దేశానికి ఆపాదించరాదని తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని విస్పష్టంగా చెప్పారు.

టైం అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్…అనే విషయం వీళ్లకు తెలియదా..కాలాన్ని వృధా చేసుకోవడమే కాకుండా..వ్యధలను ఎవరైనా కొని తెచ్చుకుంటారా..తమకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టేసుకుని, జీవితాన్ని కష్టతరం చేసుకుని..నుపుర్ ఎపిసోడ్ తోనే కాలం గడిపేస్తున్నారు. ద్వేషభావం పెంచేసుకుంటున్నారు.

పొరపాటు జరిగితే గ్రహపాటుగానో, మరేదో కారణంగానో భావించి సరి చేసుకోవాలి. అలవాటుగా చేసుకోరాదని చెప్పవచ్చు. క్షమాపణలు కోరవచ్చు. తీరు సరిచేసుకోమని సలహా ఇవ్వవచ్చు. అరమరికలు లేకుండా మాట్లాడుకుంటే..పోట్లాటలకు తావుండదు కదా!

మత గ్రంధాలైనా, మత బోధకులైనా, గురువులైనా, మహా కవులైనా, నీతి శాస్త్ర కోవిదులైనా, న్యాయశాస్త్ర ప్రవీణులైనా..చెప్పే మంచి సూత్రాలు ఎప్పుడూ ఒకేలా వుంటాయి. కోపం శతృవు, శాంతం మిత్రుడు, దయ చుట్టం..అని చెబుతూంటారు. నిలువెల్ల కాల్చేస్తుంది నీలోని ద్వేషం, పోరు నష్టం, పొందు లాభం..అనే వాక్కులను తరచు మత గురువులు బోధిస్తూవుంటారు. జడివాన వెలిశాక జరిగింది తెలుస్తుందని, ఈలోపున విరిగిపడే చెట్లకు, ఒరిగిపోయే ఇళ్లకు లెక్కపత్రాలే వుండవని…మానవతావాదులు అంటూంటారు. అందుకే శాంతచిత్తంతో వ్యవహరించి..ఏదో మాట పట్టుకుని..మారణహోమాలు సాగించేస్తుంటే..ఈ పరిణామాలకు ముగింపు ఎప్పుడు..?

పంచమ వేదంగా చెప్పబడుతున్న భారతమైనా, పరమ పవిత్ర గ్రంధమైన రామాయణమైనా..మరే మత గ్రంథమైనా అసూయాద్వేషాలు తగవనే చెబుతున్నాయి కదా ! అసూయా ద్వేషాలు పెంచేసుకుని, దురాగతాలకు పాల్పడి..దుర్మార్గ ప్రవర్తనకు లోనై భారతంలోని దుర్యోధనుడు ఏమయ్యాడు..అధర్మానికి సర్వం కోల్పోయాడు. దిక్కుమాలిన చావుకు గురయ్యాడు. సర్వ జగత్తుకు దిశా, నిర్దేశం చేయగల సత్తా వున్న హిందుమతంపైనా, హిందు గ్రంథాలు, దైవాలపైన అనుచితంగా వ్యవహరించడం ఇకనైనా మానుకోవాలని ఎందరో కోరుతున్నారు.

నుపుర్ మీద కారాలు, మిరియాలు నూరేసి, అది చేస్తాం, ఇది చేస్తాం..అని మాటల యుద్ధాలు, వీధుల్లో వికార చేష్టలకు పాల్పడితే..ఏం సాధించినట్టు అవుతుంది. హిందూ దైవాలు, హిందూ గ్రంథాలు, హిందూ బంధువులపై..ఎందరెందరో ఎన్నెన్నో అనుచిత వ్యాఖ్యలు చేసేస్తున్నారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. వర్ణించడానికి వీలులేని అసభ్యకర పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఇవన్నీ చేసి..ఏం సాధించాలనుకుంటున్నారు. హైందవ శక్తి ముందు, హైందవ పౌరుషం ముందు..మనం నిలబడగలమా అనే ఆలోచనలు ఏమైనా వున్నాయా..? హిందువులు సహనానికి మారుపేరు కనుకే…తాము బతికి బట్టకడుతున్నామని తెలుసుకోవాలి.

అనుచిత కార్యాలు చేసే వారికే ఈ పరిస్థితులు ఎదురైతే..ఎంతగా స్పందిస్తారు. మరి హిందువులు ఘోర అవమానాలకు గురవుతుంటే పట్టించుకోనివారు..ఓ మహిళ, ఏ పరిస్థితుల వల్లో పరాయి మతానికి సంబంధించి చిన్న పరుషవాక్యం పలికితే..బ్రహ్మాండం బద్దలైపోయినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ రీతిన ఆలోచిస్తే…హిందువులు, తమ సర్వస్వంగా భావించే దైవాలపై అత్యంత నీచంగా కొందరు నికృష్టులు ప్రవర్తిస్తుంటే..వారు ఏం చర్యలు..ఎన్ని బంద్ లు, హర్తాళ్ లు, ఆందోళనలు చేయాలి.. ఇలా పరిపరి ప్రశ్నలను హిందూ బంధువులు సంధిస్తున్నారు.

“దారా హువా” నినాదం దారుణ అబద్దమనే విషయం తేటతెల్లమైపోయింది. ఇది ఎప్పటికీ నిజం కాదని సదరు పెద్దలు ఉదారబుద్దితో నిరూపించేశారు. హిందువులు ఒంటరిగా వున్నారని, వారి కోసం ఏ దేశం మాట్లాడదని, వారిపై జరిగిన అకృత్యాలను ఎవరూ ఖండించరని సెలవిచ్చారు కదా.. హిందువుల ఐక్యతకు ఇది చాలదా.

ఉదార గణాల్లోని ఉదార గుణసంపన్నులు నుపుర్ మరణ బెదిరింపులపై సత్యదూరమైన విషయాలు ఎన్నో వల్లెవేస్తున్నారు. P B మెహతా తన వ్యాసంలో “కాన్పూర్‌” లో తప్ప, ఎక్కడ ఇలాంటివేమి లేవని చెప్పారు. ఇది శుద్ధ అబద్ధం అని నెటిజన్లు, ట్విటిజన్ లు కోడై కూస్తున్నారు. లైవ్ టీవీల్లో రిలే అయిన వందలు, వేల సంఖ్యలో ద్వేషపూరిత సందేశాలు, హత్య చేస్తామని బెదిరింపు విషయాలు..ఉదార మేధావుల కంటికి కనిపించవు. చెవులకు వినిపించవు. ఇస్లామిస్ట్ ల పిచ్చిపేలాపనలను వేనోళ్ల పొగిడుతూ, నిస్సిగ్గుగా అబద్ధాలాడేస్తున్న ఉదార గ్యాంగ్ చేష్టలు చూసి అందరూ సిగ్గుపడాల్సి వస్తోంది. ఉదార ముసుగుదారులు ఏం చేసినా తప్పుకాదు. హిందూ దైవ దూషణ, హిందూజాతిపై అనుచిత వైఖరి ప్రదర్శించినా హిందువులు నోరెత్తి మాట్లాడ కూడదు. ఇదే ..ఇస్తామిస్ట్, లెనినిస్ట్ ఉదారు ముసుగుదారుల ఉదారవాద స్వభావం.

హిందు దైవాలను, హిందువులను అతి నీచంగా చూసి, క్రూరంగా ద్వేషించే ఇస్లామిస్ట్ జుబైర్. హిందూ దేవుళ్ళ గురించి ఎన్నో ద్వేషపూరిత ట్వీట్లు, పోస్ట్‌లు పెట్టాడు. ఆ పాపాల పుట్ట వెలికి తీతలో భాగంగా, ఆయనగారి FB ఖాతా తీసిపారేశారు. కుక్క తోక వంకర వాళ్లకు..ఇదో పెద్ద లెక్క కాకపోవచ్చు. అయినా..ముందు ముందు వుంటుంది మొసళ్ల పండుగ. నూపుర్ సింగిల్ వ్యాఖ్యకు ప్రతిగా మీరు నోరు పారేసుకుని..వేలకొద్దే ద్వేషపూరిత, అనుచిత, అసంబద్ధ సందేశాల వెలికితీత కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఉదారబుద్ది పెద్దలూ…ఈ చాంతాడు లిస్ట్ రిలీజ్ చేశాక లెక్కబెట్టుకోవడానికి రెడీ అవుదురుగాని. సారీ…మరి చేసిన పాపపు పనికి శిక్షలుంటాయి కదా ! కటకటాల ఊచలు సైతం తాపీగా లెక్కబెట్టుకుందురుగాని, ఓకేనా.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

nine − 8 =

Back to top button