More

    ఎన్ఠీఆర్ తో జాన్వీ కపూర్‌!?

    ప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త బాగా షికారు చేస్తోంది. ‘ఎన్ఠీఆర్30’ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్‌ చేయబోతోందని! అవునా.. ఇది నిజమా? అంటున్నారు జూనియర్ ఎన్ఠీఆర్ అభిమానులు. అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ఇప్పుడు సౌత్ వైపు అడుగులేసేందుకు ఆసక్తి చూపిస్తోందిట! ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించాలని అనుకుంటోందట. కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ సౌత్ సినిమాల గురించి, అలాగే ఎన్టీఆర్ గురించి ప్రతి చోటా మాట్లాడుతోన్న తీరు చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. వాస్తవానికి ‘లైగర్’ సినిమాతో జాన్వీ కపూర్‌ని సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పూరి జగన్నాథ్ ఎంతగానో ప్రయత్నించారట. ఈ విషయం ‘లైగర్’ ప్రమోషన్స్‌లో కూడా పూరి చెప్పుకొచ్చారు. ‘లైగర్’ కంటే ముందు కూడా చాలా సినిమాల విషయంలో జాన్వీ కపూర్‌ సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. బోనీకపూర్ కూడా జాన్వీకపూర్ సౌత్ ఎంట్రీ గురించి మాట్లాడారు కానీ.. సమయం ఉందని చెప్పారు. జాన్వీ మాటలు చూస్తుంటే.. ఇప్పుడాసమయం వచ్చేసినట్లే అనిపిస్తుంది.
    ఎందుకంటే.. బాలీవుడ్‌లో చక్రం తిప్పాలని ఆమె ఎంతగా ప్రయత్నించినా.. బాక్సాఫీస్ వద్ద ఆమె చిత్రాలేవీ విజయం సాధించలేకపోతున్నాయి.. కేవలం ఓటీటీకే ఆమె చిత్రాలు అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడామెకు బాలీవుడ్‌లో అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ పరిధి ఏ విధంగా మారిపోయిందో తెలియంది కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే.. జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ ఎంట్రీ ఎన్టీఆర్ సినిమాతో అయితే బాగుంటుందని కూడా జాన్వీ భావిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తన తాజా ఇంటర్వ్యూలో సౌత్‌లో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారనే ప్రశ్నకు.. ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా.. ఎన్టీఆర్ పేరు చెప్పేసింది. ఎన్టీఆర్ అద్భుత నటుడని, ఆయనతో నటించేందుకు ఎంతోగానో వేచి చూస్తున్నానని జాన్వీ తెలిపింది. ఆమె ఈ సమాధానం తర్వాత.. ‘NTR30’ టీమ్ కూడా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నిస్తునట్లుగా టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘NTR30’ సినిమా తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన తాజా అప్‌డేట్‌ ప్రకారం.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు. ఆ ఛాన్స్ కోసం జాన్వీ కపూర్ ట్రై చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

    Trending Stories

    Related Stories