More

  బ‌ల్మూరి వెంక‌ట్‌ అరెస్ట్

  నేష‌న‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) నాయ‌కుడు బ‌ల్మూరి వెంక‌ట్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి నివాసానికి త‌న అనుచ‌రుల‌తో వెళ్తుండ‌గా వెంక‌ట్‌ను పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. వెంక‌ట్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌ను సృష్టించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు పోలీసులకు ప‌క్కా స‌మాచారం అందడంతో అత‌న్ని ముంద‌స్తుగా అదుపులోకి తీసుకొని గోల్కొండ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వెంకట్‌ను విడుద‌ల చేయాల‌ని పోలీసుల‌ను ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కోరినట్లు తెలుస్తోంది.

  అంతకు ముందు రోజు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న ఘటనల్లో తాము లేమని బల్మూరి వెంకట్‌ చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన సంఘటనకు ఎన్‌ఎస్‌యూఐకి ఎలాంటి సంబంధం లేదని వెంకట్‌ ఓ వీడియో విడుదల చేశారు.ఆర్మీ నియామక పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆవేశానికి లోనైన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనతో ఎన్‌ఎస్‌యూఐకి ఎటువంటి సంబంధం లేదన్నారు. అభ్యర్థుల నిరసనలో మాకు ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే కార్యకలాపాలను ఎన్‌ఎస్‌యూఐ చేయబోదన్నారు.

  spot_img

  Trending Stories

  Related Stories