More

    నవంబర్ 15న ‘హను-మాన్’ టీజర్ రానుంది!

    క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’ వస్తున్నారు. యంగ్ టాలెంటడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.
    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 15న హను-మాన్ టీజర్ విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రంగుల చొక్కా, పంచె ధరించి ఒక కొండపై నిలబడి శంఖం పూరిస్తున్నట్లు కనిపించారు తేజ సజ్జ. పొడవాటి జుట్టు, గడ్డం, కంప్లీట్ బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ లో తేజసజ్జా లుక్ అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో ప్రత్యేక శక్తులు కలిగిన సూపర్ హీరోగా కనిపించనున్నారు. పోస్టర్ మార్వలెస్ గా కనిపిస్తోంది.
    వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

    Trending Stories

    Related Stories