National

బాయ్ కాట్ పిలుపు సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది: ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్

ఇటీవలి కాలంలో పలు సినిమాలపై బాయ్ కాట్ పిలుపును ఇస్తున్న సంగతి తెలిసిందే..! ఈ పిలుపుల కారణంగా భారీ సినిమాలు కాస్తా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి. సినిమాల్లో దమ్ము లేక ఫ్లాప్ అవుతున్నాయి.. బాయ్ కాట్ పిలుపుల కారణంగా కాదని చెప్పుకొచ్చారు. అయితే ట్రేడ్ అనలిస్టులు మాత్రం సినిమాలపై బాయ్ కాట్ పిలుపులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు.

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ఈ విషయాన్నే చెప్పుకొచ్చారు. ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చినా ఫలితం లేకుండా పోయిందని తప్పుడు ప్రకటనలు చేస్తున్న వ్యక్తులపై సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ మండిపడ్డారు. “Stop being in denial about #Boycott calls not affecting film biz… The fact is, these #Boycott calls have made a dent and impacted the Box Office numbers of Laal Singh Chaddha specifically… Face it!” అంటూ ట్వీట్ చేశారు.

అమీర్ ఖాన్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా, అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ వివాదంలో చిక్కుకుంది. ఓపెనింగ్ డే, వీకెండ్ లలో వసూళ్లు భారీగా తగ్గాయి. గత 13 ఏళ్లలో అమీర్ ఖాన్ సినిమాలలో అత్యల్ప ఓపెనింగ్‌గా ఈ సినిమా అని చెబుతున్నారు.

Related Articles

Back to top button