కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ కు గుర్తింపు లేదని తేల్చేసిన ఐసీసీ

0
745

కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌ అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో టోర్నమెంట్ ను నిర్వహించాలని భావిస్తోంది. ఈ వివాదాస్పద టోర్నమెంట్‌ను గుర్తించవద్దని బీసీసీఐ చేసిన అభ్యర్థనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందించింది. ఈ అంశంపై ఒక వివరణను ఇస్తూ ఈ టోర్నమెంట్ కు ఎటువంటి గుర్తింపు లేదని తమ పరిధిలో లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ ను అంతర్జాతీయ టోర్నమెంట్‌గా గుర్తించలేదని తమ పరిధిలో లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐసీసీ అధికారి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కానందున తమ అధికార పరిధిలో లేదని తేల్చి చెప్పింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి జాతీయ సమాఖ్య తమ భూభాగంలో దేశీయ మ్యాచ్‌ల స్టేజింగ్‌ను మంజూరు చేయడానికి ఏకైక మరియు ప్రత్యేకమైన హక్కును కలిగి ఉంటుంది. అసోసియేట్ సభ్యుల భూభాగంలో మ్యాచ్‌లు జరగాలంటే మాత్రమే ఐసీసీ జోక్యం చేసుకోవచ్చు. బోర్డు సభ్యులందరూ ఐసీసీ ఆమోదం పొందకుండానే దాని భూభాగంలో దేశీయ మ్యాచ్‌లను నిర్వహించడానికి అధికారం కలిగి ఉంటారు.

ఈ ప్రాంతం యొక్క వివాదాస్పద స్థితిని పేర్కొంటూ కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌ను గుర్తించవద్దని బీసీసీఐ గతంలో ఐసీసీ కి లేఖ రాసింది. వివాదాస్పద లీగ్‌లో పాల్గొనకుండా తమ ప్రస్తుత మరియు మాజీ ఆటగాళ్లను నిషేధించాలని విదేశీ బోర్డులను కోరినట్లు సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాలకు సంబంధించినది కనుక ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా పాటిస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) ఆడుతున్న క్రికెటర్లతో బోర్డుకు ఎలాంటి సమస్యలు లేవని, అయితే అది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిర్వహించబడుతుందని, దానికి మద్దతు ఇవ్వలేమని ఆ అధికారి తెలిపారు. ఈ టోర్నమెంట్ ఆగస్టు 6 న ప్రారంభం కానుంది మరియు పాకిస్థాన్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ మరియు ఇతరులు పాల్గొంటారు. ఈ టోర్నమెంట్ విదేశీ క్రికెటర్లు మొదట పాల్గొనాలని అనుకున్నారు. కానీ బీసీసీఐ తీరును చూశాక చాలా మంది ఇప్పటికే వైగోలిగారు.

క్రికెట్ బోర్డులతో మాట్లాడుతూ వస్తున్న బీసీసీఐ:

పాక్ ఆధీనంలోని కాశ్మీర్‌లో ఉన్న ముజఫరాబాద్‌‌ క్రికెట్ స్టేడియంలో కాశ్మీర్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించాలని పీసీబీ ప్లాన్ చేస్తోంది. ఈ లీగ్ లో క్రికెటర్లని ఆడేందుకు అనుమతించొద్దని అన్ని దేశాల క్రికెట్ బోర్డులని బీసీసీఐ కోరుతోంది. బీసీసీఐ అభ్యర్థనపై ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పందించింది. కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లోకి తమ దేశానికి చెందిన తాజాగా, మాజీ ఆటగాళ్లని అనుమతించబోమని హామీ ఇచ్చింది. మిగిలిన క్రికెట్ దేశాల నుంచి కూడా తాము దీన్నే ఆశిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. విదేశీ క్రికెటర్లు గిబ్స్ (దక్షిణాఫ్రికా), మాంటీ పనేసర్ (ఇంగ్లాండ్), తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక) తదితర మాజీ క్రికెటర్లు కూడా ఈ లీగ్‌లో ఆడేందుకు తొలుత సంతకాలు చేశారు. కానీ ఈ లీగ్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు సోమవారం పనేసర్ స్పష్టం చేశాడు. మరికొందరు కూడా తప్పుకుంటూ ఉన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here