More

    అమెరికాలో మరోసారి కాల్పులు.. ఈ సారి మాత్రం వారి పని కాదంటా..!

    అగ్రరాజ్యం అమెరికా కాల్పుల పరంపర ఇప్పుడు యూరప్‎కు పాకింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఐరోపా దేశం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌ కాల్పులతో దద్దరిల్లింది.

    కోపెన్‌హగెన్‌లోని ఫీల్డ్స్‌ ప్రాంతంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్‌ మాల్‌లో దూరిన ఆగంతకుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కోపెన్ హెగెన్ ప్రాంతంలో సిటీ సెంటర్, విమానాశ్రయం ల మధ్య ఉన్న అమేగర్ జిల్లాలో ఉన్న మాల్ లో ఆదివారం కాల్పులు జరిపాడు అగంతకుడు. కాల్పుల శబ్ధాలు విన్న జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

    కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాపింగ్‌మాల్‌ను చుట్టుముట్టారు. ఆదివారం సాయంత్రం 5.37 గంటల సమయంలో మాల్‌లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం 11 నిమిషాల్లోనే 22 ఏండ్ల వయస్సు కలిగిన అనుమానితుడిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రచర్య కాదని.. నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.

    ఫీల్డ్స్ మ‌ల్టీస్టోరీ షాపింగ్ మాల్ .. డెన్మార్క్‌లో పెద్ద షాపింగ్ సెంట‌ర్‌. దీంట్లో 140 షాపులు, రెస్టారెంట్లు ఉన్నాయి. రాజ‌ధాని కోపెన్‌హెగ‌న్ కు శివారు ప్రాంతంలో ఉంది. అక్క‌డున్న స‌బ్‌వే సెంట‌ర్‌తో సిటీ క‌న‌క్ట్ అవుతుంది. అయితే షాపింగ్ సెంట‌ర్ స‌మీపంలో ఉన్న ఓ ఆడిటోరియంలో ఆదివారం హ్యారీ స్ట‌యిల్స్ షో జ‌ర‌గాల్సి ఉంది. ఆ షోను ర‌ద్దు చేశారు. ఆ షాపంగ్ సెంట‌ర్ వ‌ద్ద ఓ హై స్కూల్‌తో పాటు వ‌ర్సిటీ కూడా ఉంది.

    SON DAKİKA💥 Danimarka’nın Başkenti Kopenhag’da bir AVM’yi basan silahlı saldırganlar çevreyi rastgele taradı, ölü ve yaralıların olduğu bildiriliyor pic.twitter.com/3iZRJ2cluR

    — Politic Türk (@politicturk) July 3, 2022

    spot_img

    Trending Stories

    Related Stories