International

అమెరికాను సైతం టార్గెట్ చేయగలిగే క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా

కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ఎప్పుడు సైలెంట్ గా ఉంటుందో.. ఎప్పుడు క్షిపణులను ఎక్కుపెడుతుందో అసలు ఊహించలేరు. దూకుడుకు మారుపేరైన ఉత్తరకొరియా మరో క్షిపణిని విజయవంతంగా ప్రదర్శించింది. సుదూర లక్ష్యాన్ని చేధించే క్రూయిజ్ క్షిపణిని పరీక్షించినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. జపాన్ ను, అమెరికాను కూడా తమ కొత్త మిసైల్స్ టార్గెట్ చేయగలవని ఉత్తర కొరియా అంటోంది. సుమారు 1500 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ఆ క్షిప‌ణి ప్ర‌యాణించ‌గ‌ల‌ద‌ని నార్త్ కొరియా మీడియా తెలిపింది. లాంచ్ వెహికిల్ నుంచి మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ట్లు ఉత్త‌ర కొరియాకు చెందిన రొడాంగ్ సిన్మన్ ప‌త్రిక ఓ ఫోటోను ప్ర‌చురించింది. ఆ క్షిప‌ణుల‌కు వ్యూహాత్మ‌క ప్రాముఖ్య‌త ఉందని ఉత్తరకొరియా మీడియా తెలిపింది. శ‌ని, ఆదివారాల్లో మిస్సైల్ ప‌రీక్షలు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ అణ్వాయుధాల‌ను కూడా మోసుకెళ్ల‌గ‌ల‌దు అని విశ్లేష‌కులు తెలిపారు. ఉత్తర కొరియా తాజా ప‌రీక్ష‌ల ప‌ట్ల‌ అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అమెరికా మిలిట‌రీ తెలిపింది. జ‌పాన్ కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. క్రూయిజ్ మిస్సైళ్ల క‌న్నా బాలెస్టిక్ మిస్సైళ్ల‌తో ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ని యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి తెలిపిందిఉత్తర కొరియా తన సైనిక కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా క్షిపణులను పరీక్షించి పొరుగు దేశాలు, అంతర్జాతీయ సమాజాన్ని బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలపై దృష్టి సారించిందని యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రయోగ స్థానం నుంచి క్షిపణి 1,500 కిలోమీటర్ల ప్రయోగించి ఉత్తర కొరియా ప్రదేశిక జలాలు దాటి లక్ష్యాన్ని చేరుకుందని.. ‘గొప్ప ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధం’ పరీక్షలు విజయవంతమయ్యాయని, ఇది శత్రు మూకలను నిరోధించే మరో ప్రభావవంతమైన ఆయధం అని ఉత్తర కొరియా ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రయోగానికి కిమ్‌ హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు. ఈ క్షిపణి పరీక్ష అమెరికా మిత్రులకు కచ్చితంగా ముప్పేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్యశ్రేణి ల్యాండ్‌ అటాక్‌ క్రూయిజ్‌ క్షిపణి దాదాపు బాలిస్టిక్‌ క్షిపణి అంత ముప్పును సృష్టిస్తుంది. న్యూక్లియర్ వార్‌ హెడ్‌ అమరిస్తే ప్రమాదం మరింత తీవ్రమవుతుంది. ఉత్తరకొరియా చేతిలో ఇలాంటిది ఉండడం శాంతి భద్రతలకు ముప్పేనని అంటున్నారు. ఉత్తర కొరియాతో శాంతిచర్చలకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు జపాన్‌లోని టోక్యోలో ఒక భేటీ జరగనుంది. ఈ భేటీలో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా ప్రతినిధులు పాల్గొననున్నారు. బైడెన్‌ ప్రభుత్వం ఉత్తర కొరియా అణునిరాయుధీకరణపై చర్చంచడానికి సిద్ధమేనని ప్రకటించినా.. ఆంక్షలను తొలగించడానికి మాత్రం సుముఖంగా లేదు. ఉత్తర కొరియాపై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నా ప్రమాదకరమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తూ.. ఎప్పటికప్పుడు పరీక్షలను జరుపుతూనే ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 − 4 =

Back to top button