More

    ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై నాన్ బెయిలబుల్ వారెంట్

    ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. ఈ పేరు గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దాల్మియా సిమెంట్స్ కేసులో తరచూ గైర్హాజరవుతున్న కారణంగా శ్రీలక్ష్మిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నాంపల్లిలోని ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు తరచూ గైర్హాజరవుతున్న శ్రీలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులోనూ శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. ఈ కేసులో శ్రీలక్ష్మి ఏ6 నిందితురాలిగా ఉన్నారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో గతేడాది క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. నిబంధనలు ఉల్లంఘించి మరీ మైనింగ్ లీజు ఇచ్చారని, నిందితులతో కుమ్మక్కు కావడం ద్వారా ప్రభుత్వాన్ని మోసగించారన్న అభియోగాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా గతంలో పిటిషనర్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.

    Related Stories