మునుగోడులో మొదలైన నామినేషన్ల సందడి

0
818

మునుగోడు ఉప ఎన్నికలో కీలమైన నామినేషన్ ప్ర‌క్రియ నేటి నుంచి మొద‌లుకానుంది. నేటి నుండి నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. ఈరోజు నుంచి ఈ నెల నేటి నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. చండూరులోని తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 6న ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిగా జ‌గ‌న్నాథ‌రావు వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి ప్ర‌క‌టించారు.

ఉప ఎన్నిక‌ను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చండూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. చండూరు త‌హ‌శీల్దార్ కార్యాల‌యానికి 100 మీట‌ర్ల దూరం వ‌ర‌కు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేష‌న్ దాఖ‌లు చేసే వ్య‌క్తితో క‌లిసి ఐదుగురుకి మాత్ర‌మే కార్యాల‌యంలోకి అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.