కేదార్నాథ్ ఆలయంలో కుక్కకు తిలకం.. తర్వాత జరిగింది ఇదే..!

0
709

కేదార్ నాథ్ మందిరానికి కుక్కను తీసుకెళ్లిన ఒక వ్లాగర్ చిక్కుల్లో పడ్డాడు. దేవాలయ ఆచారాల ప్రకారం.. పూజారి చేత కుక్కు తిలకం పెట్టించి.. తనతో పాటు ప్రణామాలు చేయించాడు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో ఆలయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చర్యలకు ఆదేశించింది. అంతే కాకుండా ఈ ఘటనను అవమానకరమైనదిగా, అభ్యంతరకరమైనదిగా, ఖండించదగిన చర్యలుగా పేర్కొంది.

నోయిడాకు చెందిన వికాస్ త్యాగి అనే వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. ఇందులో భాగంగా వివిధ ప్రదేశాలు తిరుగుతుంటాడు. తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్తుంటాడు. ప్రస్తుతం చార్ ధామ్ యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుక్కతో పాటు కేదార్‌నాథ్ వెళ్లాడు త్యాగి. తనతో పాటు కుక్క చేత కూడా పూజ చేయించాడు. ఇందులో భాగంగా నందికి నమస్కారం పెట్టించడం, గుడికి ప్రణామాలు చేయించడం లాంటివి చేశాడు. ఇవే కాకుండా ఒక పూజారి చేత కుక్కకు బొట్టు పెట్టించాడు.

దీన్నంతిటినీ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో కింద తన కుక్క మాట్లాడుతున్నట్లు పోస్ట్‌ రాశాడు. 74వేల మంది ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతాలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌ అయింది. కాగా, ఈ వీడియోపై కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వికాస్ చేసిన పని అవమానకరమైనదిగా, అభ్యంతరకరమైనదిగా, ఖండించదగిన చర్యలుగా పరిగణించింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, చర్యలకు సైతం ఆదేశించామని ఆలయ కమిటీ తెలిపింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here