International

15 ఏళ్లు పైబడిన బాలికలు తాలిబాన్ యోధులను వివాహం చేసుకోవాలి.. తాలిబాన్లు పెట్టిన కొత్త రూల్స్

యుఎస్-నాటో దళాలు ఆఫ్ఘనిస్థాన్ ను వీడుతున్న తరువాత తాలిబాన్లు వేగంగా పురోగతి సాధిస్తూ వస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లోని చాలా ప్రాంతాలను వారి సొంతం చేసేసుకున్నామని వారు ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి సమయంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోతున్నాయనే వాదనలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా పాత మత నియమాలను తాలిబాన్లు తీసుకుని వచ్చారనే కథనాలు ప్రసారమవుతూ ఉన్నాయి.

తాలిబాన్లు మానవ హక్కులను.. ముఖ్యంగా మహిళల హక్కులను పరిరక్షిస్తామని చెప్పినప్పటికీ.. అది కేవలం “ఇస్లామిక్ విలువల” ప్రకారం మాత్రమేనని.. వాటిని పాటించకపోతే దారుణమైన శిక్షలను అనుభవించాల్సిందేనట..! ఆఫ్ఘనిస్థాన్ లో కొత్తగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో తాలిబాన్లు విధించిన కొత్త నిబంధనలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక జిల్లాను స్వాధీనం చేసుకున్న కొద్దికాలానికే, స్థానిక ఇమామ్‌కు లేఖ రూపంలో తాలిబాన్లు మొదటి ఆదేశాలను జారీ చేశారని అంటున్నారు. కలాఫ్గాన్ జిల్లా నివాసి అయిన 25 ఏళ్ల సెఫతుల్లా మాట్లాడుతూ “స్త్రీలు సహచరుడు(తండ్రి, కుమారుడు, సోదరుడు, భర్త) లేకుండా బజార్‌కు వెళ్ళకూడదని, పురుషులు గడ్డం తీయకూడదని కొత్త నిబంధాల్లో ఉన్నాయి” అని అన్నారు. తజికిస్థాన్‌కు అనుసంధానించిన ఉత్తర కస్టమ్స్ పోస్ట్ షిర్ ఖాన్ బందర్‌లో కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.స్థానిక కర్మాగారంలో పనిచేసే సజేదా అనే మహిళ మాట్లాడుతూ “షిర్ ఖాన్ బందర్ లో తాలిబాన్ మహిళలు తమ ఇళ్ళ నుండి బయటపడవద్దని ఆదేశించారు” అని అన్నారు. “ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు షూ తయారీ చాలా మంది మహిళలు మరియు యువతులు ఉన్నారు. తాలిబాన్ యొక్క కొత్త ఆర్డర్స్ ఇప్పుడు మమ్మల్ని భయపెడుతోంది” అని ఆమె తెలిపారు. తాలిబాన్ పాలనకు భయపడి కొందరు పారిపోతూ ఉన్నారు కూడానూ..!

‘మీ కుమార్తెలకు తాలిబాన్‌తో వివాహం చేసుకోండి’

తాలిబాన్ యొక్క సాంస్కృతిక కమిషన్ పేరిట జారీ చేసిన లేఖ ప్రకారం, గ్రామస్తులు తమ కుమార్తెలు, వితంతువులను ఉద్యమంలో ఉన్న తాలిబాన్ సైనికులకు ఇచ్చి వివాహం చేయాలని ఆదేశించారు. “స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లోని ఇమామ్‌లు, ముల్లాలు తాలిబాన్‌లకు 15 ఏళ్లు పైబడిన బాలికల జాబితా నుండి, 45 ఏళ్లలోపు వితంతువుల జాబితాను చూసి తాలిబాన్ యోధులకు ఇచ్చి వివాహం చేయాలి” అని లేఖలో ఉంది.

‘ధూమపానం మరియు షేవింగ్ లేదు’

తాలిబాన్ లు ధూమపానంపై నిషేధాన్ని కూడా జారీ చేశారు. స్థానికులు చెప్పినదాని ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించే ఎవరైనా తీవ్రంగా శిక్షను అనుభవిస్తారని తాలిబాన్లు హెచ్చరించారు. 32 ఏళ్ల నజీర్ మొహమ్మద్ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరూ తలపాగా ధరించమని ఆదేశించబడ్డారని, ఎవరినీ షేవింగ్ చేయడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారని’ అన్నారు.

‘రాత్రి ఎవరూ ఇంటి నుంచి బయలుదేరలేరు’

“తజికిస్తాన్ సరిహద్దులోని యావాన్ జిల్లాలో తాలిబాన్లు బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మసీదు వద్ద వారి కమాండర్లు రాత్రి ఎవరినీ ఇంటి నుండి బయటకు రావడానికి అనుమతించరని మాకు చెప్పారు” అని మొహమ్మద్ తెలిపారు.

‘ఎరుపు ఆకుపచ్చ రంగు ధరించ కూడదు’.. ‘అమ్మాయిలకు పాఠశాల లేదు’:

ప్రజలు కొన్ని రంగులు ధరించడాన్ని నిషేధించారని మొహమ్మద్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా యువకులు – ఎరుపు మరియు ఆకుపచ్చ దుస్తులను ధరింకూడదని ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. “ఆరవ తరగతికి మించి బాలికలు పాఠశాలలకు హాజరవ్వకూడదనే నిబంధనలు తీసుకుని వచ్చారనే” వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.

ఖండించిన తాలిబన్ ప్రతినిధి:

తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ “అవి కల్పిత కాగితాలను ఉపయోగించి పుట్టుకొచ్చిన పుకార్లు. ఇవి నిరాధారమైన వాదనలు” అని చెప్పుకొచ్చారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో ద‌ళాల ఉప‌సంహ‌రణను పెద్ద తప్పిదంగా అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్ అభివర్ణించారు. నాటో ద‌ళాలు వెన‌క్కి వెళ్ల‌డం వ‌ల్ల ఆఫ్ఘ‌న్ పౌరుల‌ను తాలిబాన్ల‌కు వ‌దిలేసిన‌ట్లు అవుతుంద‌ని.. తాలిబాన్లు ప్రజలను ఊచకోత కోస్తారని జార్జ్ బుష్ హెచ్చ‌రించారు. ఆఫ్ఘ‌నీ మ‌హిళ‌లు, అమ్మాయిలు ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొంటార‌ని అన్నారు. ఇది పొర‌పాటు అని, త‌న గుండెను క‌లిచివేస్తోంద‌ని జార్జ్ బుష్ తెలిపారు. 2001లో అమెరికాపై ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌ర్వాత ఆ నాటి అధ్య‌క్షుడైన బుష్ ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ద‌ళాల‌ను పంపారు. 20 ఏళ్ల కిందట ఆఫ్ఘనిస్థాన్ లో ప్రారంభమైన తమ సైనిక కార్యాచరణ ఆగస్టు 31తో పూర్తిగా ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి ఉగ్ర దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తికానుండడంతో గత మే ఒకటో తేదీ నుంచి బలగాల ఉపసంహరణ మొదలుపెట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

twenty − 10 =

Back to top button