More

    ఆఫ్తాబ్ అమీన్ కు పాలీగ్రాఫ్, నార్కో పరీక్షలు వాయిదా

    శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడైన ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు జ్వరం వచ్చిందట.. ఆఫ్తాబ్ జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో అతనికి పాలీగ్రాఫ్, నార్కో పరీక్షలు వాయిదా వేశారు. ఆఫ్తాబ్‌కు జ్వరం, జలుబు సోకడంతో అతనికి పాలీగ్రాఫ్ పరీక్ష చేయలేదని రోహిణి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) అధికారులు చెప్పారు. ఆఫ్తాబ్ జ్వరం నుంచి కోలుకున్న తర్వాతే అతనికి పాలీగ్రాఫ్ పరీక్ష చేస్తామని వారు చెప్పారు. ఆఫ్తాబ్ భావోద్వేగ, మానసిక, శారీరక శ్రేయస్సును నిర్ధారించాకే నార్కో పరీక్షలు చేయనున్నారు. ఆఫ్తాబ్‌కు రోహిణిలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌లో లై డిటెక్టర్ టెస్ట్ అని పిలిచే పాలిగ్రాఫ్ పరీక్ష మొదటి సెషన్‌లో ఉంచినా, అతనికి జ్వరం రావడంతో బుధవారం ఎలాంటి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించలేదని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా తెలిపారు.

    సహజీవనం చేస్తున్న సమయంలో రెండేళ్ల క్రితమే ఆఫ్తాబ్ అమీన్, శ్రద్ధావాకర్ మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆమెను ఆఫ్తాబ్ అమీన్ కొట్టాడు. ఆమెకు ఊపిరాడకుండా చేసి, హత్య చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో ఆమె మహారాష్ట్రలోని వసాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను చంపి, ముక్కలు చేస్తానని… ఆ ముక్కలను విసిరేస్తానని అఫ్తాబ్ బెదిరించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఇది జరిగి ఆరు నెలలు అయిందని… కానీ చంపేస్తానని బెదిరించడంతో ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేదని చెప్పింది. 2020లో ఆమె ఈ ఫిర్యాదు చేసింది. అతనితో కలిసి ఉండాలని లేదని కూడా ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

    Trending Stories

    Related Stories