Telugu States

విజయవాడలో మంకీపాక్స్ లేదని స్పష్టీకరణ

విజయవాడలో మంకీపాక్స్ కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే..! దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో.. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. అయితే ఆ చిన్నారికి మంకీపాక్స్ నెగెటివ్ గా వచ్చింది. ఆ బాలికకు మంకీపాక్స్ కాదని వైద్యులు నిర్ధారించారు. ఆ బాలికకు చర్మంపై మామూలు దద్దుర్లు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు.

దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి ఒంటిపై దద్దుర్లు రావడంతో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ చిన్నారికి మంకీ పాక్స్‌ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానించారు. చిన్నారి నుంచి నమూనాలను సేకరించిన అధికారులు పుణె ల్యాబ్‌కు పంపారు. ఆ కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్‌లో ఉంచినట్లు సమాచారం.

Related Articles

Back to top button