More

    రెండో రోజూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత

    కోనసీమలో వరుసగా రెండో రోజు కూడా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అమలాపురం సహా అన్ని మండలాల్లో అన్ని టెలికాం కంపెనీల నెట్ సర్వీసులు ఆపివేశారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లో నుంచి ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ సేవలకూ ఇబ్బంది ఎదురవుతోంది. ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

    కోనసీమకు ఐదు జిల్లాల నుంచి రప్పించిన 1,300 మంది సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీ, ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు, కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రైల్వే ఎస్పీ విశాల్‌గున్నీ, సీపీ సిద్ధార్థ్‌ కౌశల్‌, పలువురు ఐపీఎస్‌ అధికారులు అమలాపురంలోనే ఉండి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు సీసీ ఫుటేజ్‌ల ద్వారా 200 మందికిపైగా నిందితులను గుర్తించారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఐజీ పాలరాజు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అమలాపురం పట్టణం, పరిసర మండలాల్లో పోలీసు అధికారుల ఆదేశానుసారం ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేశారు.

    Trending Stories

    Related Stories