More

  నాన్ హలాల్ రెస్టారెంట్ ను ప్రారంభించిన మహిళ.. ఆమెపై దాడి

  గో వధ వద్దు. గో మాంసం విక్రయాలు అసలే వద్దు. గోవు మాకు పవిత్రమైన జంతువు. మాకు మాతృమూర్తితో సమానం. తల్లిలేని పిల్లలకు సైతం ఆవు పాలే ఆహారం. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే గోవు మనకు దేవత. హిందువుల సెంటిమెంటుకు సంబంధించిన అంశం.! అయితే గో వధ వద్దు..! దేశంలో గో మాంసం విక్రయాలు వద్దు అన్నప్పుడు… మన దేశంలోని సోకాల్డ్ లెఫ్ట్ లుటియెన్స్ స్వయం ప్రకటిత మేధావులు, హక్కుల సంఘల నేతలు, తుక్డే తుక్డే గ్యాంగులు, ఇంకా కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు… మేము ఏదీ తినాలనేది మా ఇష్టం.! మా ఆహారం అలవాటును ప్రశ్నించడానికి మీరే ఎవరు? మేము ఏదీ తినాలో కూడా మీరే నిర్ణయిస్తారా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఊదరగొడుతూ పోస్టులు పెడుతుంటారు. ఇంకా టీవీ చర్చల్లో అయితే అవేశంతో ఊగిపోతూ కనిపిస్తుంటారు.
  సరే.. గో వధను నిషేధించాలని భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 48 స్పష్టంగా చెబుతోంది. భారతీయ సంస్కృతిలో గోవుకు ఉన్న విశిష్టమైన ప్రధాన్యతను దృష్టిలో ఉంచుకుని…అనేక రాష్ట్రాలు కూడా గో వధను నిషేధించాయి. అలాగే భారతీయ వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమకు వెన్నుముక అయిన గోవుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కానీ మన దేశంలోని సోకాల్డ్ మేధావులకు, కాలం చెల్లిన మార్క్స్ అద్దాలతో వార్తలు రాసే లెఫ్ట్ లుటియెన్ జర్నలిస్టులకు ఇవేవి పట్టవు. వారికి అవసరమైనప్పుడే భారత రాజ్యాంగం, హక్కులు గుర్తుకు వస్తుంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే…!
  కేరళకు చెందిన తుషారా అనే మహిళా వ్యాపారవేత్త ఈ ఏడాది జనవరి 15వ తేదీన ఎర్నాకుళంజిల్లాలోని పలరిపట్టణం నాన్ హలాల్ రెస్టారెంట్ ను ప్రారంభించింది. త్వరలోనే రెండో బ్రాంచ్ ను సైతం ఏర్పాటు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందుకు సంబంధించి బ్యానర్లను సైతం ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడే ఇస్లామిక్ మతోన్మాదులు ఎంటర్ అయ్యారు. కేరళలో ఇప్పుడు కమ్యూనిస్టులు.. జీహాదీ శక్తులు కలిసి పోయారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేరళ… ఐసిస్ స్లిపర్ సెల్స్ కు అడ్డగా మారిందంటూ నిఘా వర్గాలు చేస్తున్న హెచ్చరికలు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఇస్లామిక్ టెర్రరిజాన్ని కట్టడిచేయాల్సిన కేరళ పినరయ్ కమ్యూనిస్టు సర్కార్ మాత్రం తమకేమి తెలియదే..! తమ వద్ద అలాంటి సమాచారం లేదే అన్నట్లుగా నటిస్తూ.. పరోక్షంగా జీహాదీ గ్రూపులకు వంతపాడుతోందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
  ఇక విషయానికి వస్తే తుషారా కేరళ రాష్ట్రంలో… నాన్ హలాల్ రెస్టారెంటు ప్రారంభించి.. తమ మనోభావాలు దెబ్బతీసిందంటూ.., మహిళా అని కూడా చూడకుండా., ఆమెపై విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం జరిగింది.! ఈ దాడిని గురించి మనం ఏమనాలి? ఈ దాడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? తమకు ఇష్టం లేకున్నా కూడా దేశ ప్రజలు అందరూ హలాల్ చేయబడిన ఆహారం మాత్రమే తినాలని నిర్ణయించే అధికారం, ఆదేశించే అధికారం ఈమూకలకు ఎవరు ఇచ్చారు?

  Woman Behind Kerala's First Non-Halal Eatery Alleges Attack Over The Tag, Serving Pork On Menu

  హలాల్ ను అసరాగా చేసుకుని దేశంలోని జీహాది శక్తులు… చాలా సైలెంట్ గా… మన దేశంలోని ఫుడ్ హ్యాబిట్ ఛేంజ్ చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాయన్నది నిప్పులాంటి నిజం. నిన్నమొన్నటి వరకు కూడా మార్నింగ్ టిఫిన్.. మధ్యాహ్నం భోజనం..అందులోనూ వేడి వేడి పప్పు, వేపుళ్ళు, ఇంకా ఆవకాయ, ఇంత నెయ్యి ఇలా అందరి మోను ఉండేది.! ఈ మెనును బేస్ చేసుకుని మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలోని కర్ణాటక, ఏపీ , తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మెస్సులు, ఫలాహారశాలలు, హోటళ్ళు నడిచేవి.
  అయితే ఇప్పుడు క్రమంగా ఫలహార హోటళ్ల స్థానంలో ఒక ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేస్తున్నారా? అన్నట్లుగా బిర్యానీ సెంటర్లు, అరబ్ మండీ హౌస్ లు తెరపైకి వస్తున్నాయి. దీంతో రెస్టారెంట్… హోటళ్ల ఫూడ్ మార్కెట్ నుంచి సంప్రదాయా హిందూ ఆచార వంటకాలు క్రమంగా మాయమైపోయాయి.
  అంతేకాదు ఇస్లామిక్ మత సంస్థలు ఇచ్చే హలాల్ సర్టిఫికేట్ ను హోటళ్లు, రెస్టారెంట్లు, బెకరీలు నడిపే యాజమానులు అందరూ తప్పక తీసుకుని తీరాల్సిందే! అందులోనూ ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అయితే ఈ హలాల్ సర్టిఫికేట్ లేకపోతే హోటలే ఉండదు.
  ఒక్క హలాల్ సర్టిఫికేషన్ పేరుతో ముస్లిం సంస్థలు అనేక వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇలా హలాల్ సర్టిఫికేషన్ ద్వారా వచ్చిన నిధులను దేశంలో ఇస్లాం మత వ్యాప్తికి, అలాగే ఉగ్ర కార్యకలాపాలకు ఈ నిధులను మళ్లీస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరికైనా సరే హలాల్ బ్రాండ్ ఫుడ్ ఇష్టం లేకపోయినా సరే… తినాల్సిన పరిస్థితులు వచ్చాయని.., ఇది తమ ఆచారం కూడా కాదని హిందూ సంస్థలు వాపోతున్నాయి. నిజానికి మాంసాహరం తినే కొన్ని హిందూ కుటుంబాలు జట్కా చేయబడిన మేక, గొర్రె మాంసాహారాన్ని స్వీకరించడం జరుగుతుంది.దీనిపై మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
  ప్రస్తుతం… కేరళలో అయితే…. ప్రతి హోటల్ లో హలాల్ సర్టిఫికేషన్ ఉంటేనే మేము తింటాం. మేము కొంటామనే కాడికి పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. మీ వ్యాపారం నడవాలంటే మేము చెప్పినట్లు వినాల్సిందేనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం కేరళలో వివాదం నడుస్తోంది.
  హలాల్ చేయబడిన ఆహారం ఇష్టపడని వారి కోసం.. తుషారా అనే మహిళా నాన్ హలాల్ రెస్టారెంట్ పెట్టడాన్ని ఇస్లామిక్ వాదులు తప్పుపట్టడం ఎంత వరకు కరెక్టు? ఈ నెల అక్టోబర్ 25న తన హోటల్ సమీపంలోనే కొంతమంది ఇస్లామిక్ మతోన్మాదులు మూక దాడి చేసిన విషయాన్ని తుషారా ఆసుపత్రిలో బెడ్ పై నే ఫేస్ బుక్ లైవ్ ద్వారా తెలిపింది. ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకుని వెళ్లిన వీడియోను తుషార కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
  అటు తుషారాపై జరిగిన దాడిని ఖండిస్తూ కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ట్వీట్ చేశారు. శ్రీమతి తుషారా అజిత్ పై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇది తాలిబానిజం కంటే తక్కువేం కాదని, కేరళపై జరుగుతున్న ఈ హలాల్ దండయాత్రను ప్రజలందరూ తిరస్కరించాలని సురేంద్రన్ పిలుపునిచ్చారు.
  మరోవైపు ఇంత జరిగినా కేరళ ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదుని వాపోతున్నారు కొంతమంది నెటిజన్లు. తుషారాపై దాడి జరుగుతున్నప్పుడు కొంతమంది రెస్టారెంటు వర్కర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. దీంతో దాడికి పాల్పడిన అసలు దోషుల సంగతిని పక్కన పెట్టి.. నాన్ హలాల్ బోర్డు పెట్టి తుషారానే రాష్ట్రంలో అశాంతిని రేకిస్తున్నారని.., ఉల్టా పోలీసులు ఆమెను నిందిస్తున్నారని తెలుస్తోంది.
  నిజానికి గతేడాది కేరళలోని క్రైస్తవ సంస్థలు సైతం ముందుకు వచ్చి హలాల్ ను వ్యతిరేకించాయి. కొచ్చికి చెందిన క్రిస్టియన్ గ్రూప్ చర్చ్ , అలాగే ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్ –CASA క్రైస్తవులు ఎవరు కూడా హలాల్ మాంసాన్ని కొనుగోలు చేయవద్దని కొరడం జరిగింది.
  ఎవరి ఆహారంపు అలవాట్లు వారివి. హలాల్ పేరుతో ఒకరి ఆహరపు అలవాట్లు మరోకరిపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు చేయడంపై మన దేశంలోని ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు, మీడియా చానళ్లు మౌనంగా ఎందుకు కుంటున్నాయి? దేశ ప్రజలారా మీకు విషయం అర్థం అవుతుందా? మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.!
  మనసా వాచా కర్మణా దేశ హితం కోసం పాటుపడండి. జాతీయవాద జర్నలిజాన్ని పోత్సహించండి. భారత్ మాతాకీ జై

  Trending Stories

  Related Stories