ఫ్యాక్ట్ చెక్: గుజరాత్ పోలీసులు క్రిమినల్ సిరాజ్ మొహమ్మద్ అన్వర్ ను అదుపులోకి తీసుకున్నారా..?

గుజరాత్‌లోని భరూచ్‌లోని హోటల్ లో నుండి ఢిల్లీ అల్లర్ల నిందితుడైన సిరాజ్ మొహమ్మద్ అన్వర్ అనే నేరస్థుడిని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారని ఒక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఈ వీడియో ఆ రహస్య ఆపరేషన్ అని చెబుతూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. అనేకమంది సోషల్ మీడియా వినియోగదారులు సిరాజ్ మొహమ్మద్ అన్వర్, అతని సహచరుడిని చిన్న క్లూ ఆధారంగా పట్టుకునేందుకు భరూచ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
వైరల్ వీడియోలో భరూచ్‌లోని ఒక వీధి ప్రక్కన ఉన్న రెస్టారెంట్‌కు సాదాసీదాగా ఉన్న నలుగురు పోలీసులు ఎలా వచ్చి స్క్రీన్ ఎడమ చివర కనిపించే టేబుల్ వద్ద కూర్చున్నారో చూడవచ్చు. కొన్ని సెకన్ల తరువాత, టేబుల్‌పై కూర్చున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసే సమయంలో ఎక్కువ మంది పోలీసులు కనిపించడం చూడొచ్చు.

ఢిల్లీ అల్లర్లలో నిందితుడిని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయిన వీడియో యొక్క స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది. ఈ మొత్తం సంఘటన నిజమైనది.. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నదైనప్పటికీ, అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది ఢిల్లీ అల్లర్లకు సంబంధించినది కాదని తెలిపారు.
ఫ్యాక్ట్ చెక్:
ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఈ వీడియో భరూచ్ లో చోటు చేసుకున్నది కాదు. గుజరాత్‌లోని పటాన్ జిల్లాలోని సరస్వతి తాలూకాలోని అమర్పురా గ్రామంలోని స్థానిక హోటల్లో చోటు చేసుకుంది. పటాన్ జిల్లా శివార్లలోని రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్ వద్ద రికార్డు అయిన సిసిటివి ఫుటేజ్ కు ఢిల్లీ అల్లర్ల కేసు అరెస్టులకు సంబంధించినది కాదు.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, అనేక నేరాలకు పాల్పడిన ఒక నేరస్థుడిని అరెస్టు చేయడానికి అహ్మదాబాద్ స్థానిక క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రారంభించిన ఆపరేషన్ ఈ ఫుటేజ్ లో ఉంది. ఆపరేషన్ సమయంలో, గుజరాత్ పోలీసులు కిషోర్ లుహార్, మరో ముగ్గురిని గుర్తించారు. పటాన్ జిల్లాలోని సరస్వతి తాలూకాలోని అమర్పురా గ్రామంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
నిందితుడు దగ్గర పిస్టల్ ను లాక్కోవడం కూడా చూడొచ్చు. ఈ సంఘటన సినిమా తరహాలో ఉండడంతో వీడియో వైరల్ అయ్యింది. వీడియోలో, పోలీసులు నిందితుడి నుండి పిస్టల్ స్వాధీనం చేసుకుని బలవంతంగా పట్టేసుకున్నారు. నిందితుడుతో పాటు ఉన్న మరో ముగ్గురిని పోలీసులు తనిఖీ చేశారు. పోలీసులు లుహార్ను నిలబెట్టడానికి తన్నాడు. జూన్ 27 సాయంత్రం అరెస్టు చేసినట్లు సిసిటివి ఫుటేజ్ తెలిపింది. క్రైమ్ బ్రాంచ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, బనస్కాంతలోని దీసా పట్టణంలో నివసిస్తున్న 29 ఏళ్ల లుహార్ అహ్మదాబాద్ నగరంలో ఏడు, బనస్కాంత జిల్లాలో ఐదు, రాజస్థాన్ లోని సిరోహి మరియు ఝాలార్ జిల్లాల్లో రెండు చొప్పున నేరాలకు పాల్పడ్డాడు.
పిస్టల్‌తో పాటు లుహార్ నుంచి ఒక మ్యాగజైన్, ఐదు లైవ్ కాట్రిడ్జ్‌లను పోలీసులు తీసేసుకున్నారు. దోపిడీ, అత్యాచారం సహా 14 నేరాలలో నిందితుడు లుహార్. సాంఘిక వ్యతిరేక చర్యల నిరోధక చట్టం కింద కేసులను నమోదు చేశారు.
ఈ ఆపరేషన్‌తో పాటు, సిరాజ్ మంజుర్ ఆలం అన్సారీ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాలను తీసుకెళ్లినందుకు అరెస్టు చేయడానికి భరూచ్ పోలీసులు మరో ఆపరేషన్ ప్రారంభించారు. భరూచ్ పోలీసులు సిరాజ్ ను మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు, అతని వద్ద నుండి రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు, సిరాజ్ మంజూర్ ఆలం అన్సారీ, అమోద్ లోని భీంపూరా ప్రాంతంలో నివసిస్తున్న బీహార్ నివాసి. భరూచ్‌లోని దారోల్ చోక్ది హైవే నుంచి నిందితుడిని అరెస్టు చేసినట్లు భరూచ్ పోలీసులు తెలిపారు. సిరాజ్‌పై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.
గుజరాత్ పోలీసులు జరిపిన రెండు కార్యకలాపాలు వేర్వేరు సంఘటనలు.. వీటికి ఢిల్లీ అల్లర్ల కేసుతో ఎలాంటి సంబంధం లేదు.