More

    కేంద్ర మంత్రికి ఊహించని అవమానం.. మెదక్ లో..!

    కేంద్ర మంత్రికి మెదక్‌లో ఘోర అవమానం జరిగింది. జిల్లా కేంద్రంలోని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బస చేసేందుకు వచ్చిన మత్స్య శాఖ, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్‌కు తాళం వేసిన అతిథి గృహం ఇచ్చిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి మెదక్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం రోజంతా పర్యటించి, రాత్రి బీజేపీ దళిత మహిళ నేత ఇంట్లో భోజనం చేశారు. అప్పటికే మంత్రి కోసం స్థానిక బీజేపీ నేతలు రహదారులు, భవనాల అతిధి గృహం బుక్ చేసి పెట్టారు. మంత్రి‌తో పాటు బీజేపీ నేతలు వచ్చి అర గంట పాటు వేచి చూశారు. అర్ అండ్‌బీ అధికారులకు సంప్రదిస్తే ఎవరు ఫోన్‌‌కి స్పందించలేదు. మెదక్, ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించగా వారి నుంచి కూడా స్పందన రాలేదు. దీంతో అధికారుల తీరు పై ఆగ్రహించిన బీజేపీ నేతలు తాళం పగల కొట్టి లోపలికి వెళ్లారు. ఓ కేంద్ర మంత్రి వస్తే కనీస గౌరవం లేకుండా అధికారులు తాళం వేశారని వాపోయారు. అతిథి గృహంలో ఆయనకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories