లక్ష ద్వీప్ బాగు కోసం భారతీయ జనతా పార్టీ కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చింది. అయితే ఈ సంస్కరణల వలన లక్ష ద్వీప్ ప్రజలకు హాని చేస్తుందనే ప్రచారాన్ని కొందరు చేయడంతో అక్కడి ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. లక్షద్వీప్‌లోని ఒక దుకాణం యజమాని తాను బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఎలాంటి వస్తువులను విక్రయించనని ఏకంగా ఒక బోర్డునే పెట్టాడు. ఇందుకు సంబంధించిన బోర్డును మీడియా సంస్థ రిపోర్టర్ నివేదించింది. ‘ఈ దుకాణం నుండి బీజేపీకి చెందిన వ్యక్తులకు ఎలాంటి వస్తువులు ఇవ్వబడవు’ అని నోటీసులో చెప్పుకొచ్చాడు సదరు షాపు యజమాని. బీజేపీ పార్టీతో సంబంధం ఉన్నవారికి ఏ వస్తువులు అమ్మబడవని తేల్చి చెప్పాడు.
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ విషయంలో భారతీయ జనతా పార్టీ కీలక సంస్కరణలు చేసింది. ఇద్దరు కంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న అభ్యర్థులను పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించడం, అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా వ్యక్తులకు తమ పడవలను లీజుకు ఇవ్వడం / అద్దెకు ఇవ్వకుండా పడవ యజమానులకు కఠినమైన ఉత్తర్వులు ఉన్నాయి. లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (ఎల్‌డిఎఆర్) 2021 ముసాయిదా ప్రకారం ఆవు వధ, గొడ్డు మాంసం నిషేధించడానికి కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. ఇది భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉన్న చట్టానికి అనుగుణంగానే ఉంది. అభివృద్ధి ప్రయోజనాల కోసం, ద్వీపాలలో “ఏదైనా ప్రాంతాన్ని ప్రణాళికా ప్రాంతంగా ప్రకటించే” అధికారాన్ని కూడా ముసాయిదాలో పొందుపరిచారు. అక్కడి ప్రజలకు మేలు కలిగించే విధంగా బీజేపీ సంస్కరణలు తీసుకుని రాగా.. కొందరు నాయకులు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలకు అవాస్తవాలను తెలియజేస్తూ ఉన్నారు.
మలయాళ న్యూస్ ఛానల్ మీడియా వన్ టీవీలో జరిగిన చర్చలో లక్షద్వీప్ మోడల్ ఈషా సుల్తానా భారత ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. లక్షద్వీప్ దీవుల ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ -19 ను బయోవెపన్‌గా ఉపయోగించుకుందని సుల్తానా ఆరోపించారు. కేంద్రం జాగ్రత్త తీసుకునే ముందు, లక్షద్వీప్‌లో COVID-19 కేసులు అసలు లేవని.. ఇప్పుడు, ఇది రోజువారీ 100 కేసులు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఈ బయో వెపన్ ను తయారు చేసిందని ఆరోపణలు గుప్పించింది. మీడియా చర్చ సందర్భంగా మలయాళంలో సుల్తానా మాట్లాడుతూ.. లక్షద్వీప్ ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బయోవెపన్‌ను మోహరించిందని తెలిపింది. దీంతో ఆమెపై అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఇలా కొందరు అనవసరంగా లక్షద్వీప్ ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారు.