More

    నిజామాబాద్ లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి

    ఇటీవలి కాలంలో చాలా మంది ఈ బైక్స్.. అదేనండి ఎలక్ట్రిక్ బైక్స్ ను కొనాలని ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ మధ్య పెద్ద ఎత్తున ఎలెక్ట్రిక్ బైక్స్ పేలుతూ ఉన్న ఘటనలు భారత్ లో ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్ కు తీరని నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్స్ పేలాయి.. ఏకంగా ఎలెక్ట్రిక్ బైక్స్ షోరూమ్ కూడా తగలబడి పోయింది. పలు రాష్ట్రాల్లో నడిరోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడిపోయిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

    ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఓ ఎలెక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో ప్రజలందరూ షాక్ అయ్యారు. ఈ ప్రమాదంలో ఏకంగా ఒకరి ప్రాణాలు పోయాయి. నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి చార్జింగ్ పెట్టిన సమయంలో మంటలు చెలరేగి బ్యాటరీ పేలినట్లుగా తెలుస్తోంది. బ్యాటరీ తీసి సపరేట్ గా చార్జింగ్ పెట్టడంతో పెద్ద శబ్ధంతో పేలింది. దీంతో అక్కడే నిద్రిస్తున్న నలుగురిలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories