More

    ఘనంగా నైజాం విముక్త స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు

    హైదరాబాద్‎: నైజాం విముక్త స్వాతంత్ర్య అమృత మహోత్సవాల యువ సమ్మేళనం గుడిమల్కాపూర్‎ గ్రీన్ హౌస్ ఫంక్షన్ హాల్‎లో ఘనంగా జరిగింది. నైజాం విముక్త స్వాతంత్ర్య అమృత మహోత్సవ ఉత్సవ సమితి గోల్కొండ బాగ్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో విశ్వభారతి ప్రచార విభాగ్ అఖిల భారతీయ సంయోజక్, దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి, భారతీ సోషియో కల్చరల్ ఆర్గనైజేన్ అధ్యక్షుడు టి.హన్మంతరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన 1500 మందికిపైగా యువకులు పాల్గొన్నారు. నైజం విముక్త స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యువత పాత్ర ఎంతో విరోచితమని, ఎందరో యువకులు ప్రాణాలు బలిచ్చారన్నారు. దేశ సేవలో యువతదే కీలక పాత్ర అన్నారు.

    Trending Stories

    Related Stories