జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ ట్రైన్ లో లో దుస్తులు మాత్రమే వేసుకుని కంపార్ట్మెంట్ లో తిరిగిన విజువల్స్ వైరల్ అవ్వడంతో ఆయన వివాదంలో ఇరుక్కున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తన లోదుస్తులతో తిరుగుతున్నందుకు అదే రైలులో ప్రయాణం చేస్తున్న తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోపాల్ మండల్ తన లోదుస్తులలో పాట్నా నుండి న్యూఢిల్లీకి ప్రయాణంలో తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క AC ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కనిపించిన ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ప్రవర్తనపై ఇతర ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవకు దారితీసింది. రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) అధికారులు, టీసీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. “ఎమ్మెల్యే ప్రవర్తనపై తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేసారు. పోలీసులు మరియు టికెట్ ఎగ్జామినర్ ఇరువర్గాలను శాంతిపజేశారు” అని తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) రాజేష్ కుమార్ అన్నారు.
సెకండ్ ఏసీ కోచ్‌లో ఆయన బనియన్, అండర్వేర్లో అటూ ఇటూ తిరిగారు. దీనిపై ఆ కోచ్‌లో ఉన్న ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూపీలోని దిల్దార్ నగర్ జంక్షన్ వద్ద .. లోదుస్తుల్లో ఉన్న ఎమ్మెల్యేకు.. ఆ కోచ్‌లో ఉన్న ఇతర ప్యాసింజెర్ల మధ్య వాగ్వాదం జరిగింది. వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ఆయన ఇతర ప్యాసింజెర్ల ముందే బట్టలు విప్పేశారు. ఎమ్మెల్యే గోపాల్ వ్యవహార శైలిని పలువురు ఖండించారు. ఓ దశలో ఆర్పీఎఫ్ పోలీసులు వచ్చి ప్రయాణీకులతో గొడవను ఆపే ప్రయత్నం చేశారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో తేజస్ రైలును దిల్దార్‌నగర్ జంక్షన్లో నిలిపేశారు.
తన కడుపులో తేడా కొట్టడం వల్లే తాను తొందరలో అండర్గార్మెంట్స్తో పరుగుపెట్టినట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. రైలు ఎక్కిన వెంటనే.. మరుగుదొడ్డికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, తక్షణమే కుర్తా పైజామా విప్పేసి.. భుజంపై టవల్ వేసుకుని శౌచాలయానికి వెళ్లాలనన్నారు. టవల్‌ను తన నడుముకు చుట్టుకునే టైమ్ లేదని ఎమ్మెల్యే అన్నారు. ఈ సంఘటనను ఆయన వివరిస్తూ.. మరుగుదొడ్డికి వెళ్తునప్పుడు ఓ వ్యక్తి నన్ను అడ్డుకున్నాడని, నగ్నంగా ఎక్కడికి వెళ్తున్నావని అడిగారని, చేయిని పట్టుకుని అతనే నన్ను డిస్టర్బ్ చేశాడని, అయినా తాను తొందరగా టాయిలెట్‌కు వెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రయాణీకులు చెబుతున్నట్లుగా ఆ కోచ్ లో మహిళలు లేరని అన్నారు. నాతో గొడవ పెట్టుకున్న వ్యక్తితో తన వయసును చూసి మాట్లాడమని చెప్పాను. నా వయసు 60. కంపార్ట్మెంట్ లోపల ఏ స్త్రీ లేదా అమ్మాయి లేనప్పటికీ అతను వివాదం సృష్టించాడని ఎమ్మెల్యే అన్నారు. ఆయన తీరు పలువురు నాయకులు తప్పుబట్టారు.