More

    యూట్యూబ్ ద్వారా నెలకు నాలుగు లక్షలు సంపాదిస్తున్న కేంద్ర మంత్రి

    కేంద్ర మంత్రి యూట్యూబ్ ద్వారా లక్షలు ఆర్జిస్తూ ఉన్నారు. నెలకు రూ.4 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. హ‌ర్యానాలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న గ‌డ్క‌రీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో తాను ఇంటికే పరిమితమై రెండు పనులు చేశాన‌ని అన్నారు. ఒకటి ఇంట్లో వంట చేయడం అని.. ఇంకోటి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం అని ఆయ‌న చెప్పారు. తాను ఆన్‌లైన్‌లో చాలా క్లాసులు తీసుకున్నాని, వాటిని యూ ట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేశాని వివ‌రించారు. దీంతో వాటికి వ్యూస్ బాగా వ‌చ్చాయ‌ని, యూట్యూబ్ త‌న‌కు నెలకు నాలుగు లక్షలు చెల్లిస్తోందని తెలిపారు.

    ఇక దేశంలో మంచి రోడ్లు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించాల్సిందేనని నితిన్‌గడ్కరీ చెప్పారు. హర్యానాలోని సోహ్నాలో గురువారం ఆయన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే పురోగతిపై సమీక్షించారు. ‘ఎక్స్‌ప్రెస్‌ వే’ల వల్ల ప్రయాణ సమయంతోపాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుందని అన్నారు. ఎక్స్‌ప్రెస్‌ వే వెంట భూములు ఉన్న రైతులు వాటిని డెవలపర్లకు అమ్ముకోవద్దని, వారితో భాగస్వాములై వసతులు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే ప్రయాణ సమయాన్ని 12 గంటలు తగ్గిస్తుందని తెలిపారు. ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవే వినియోగిస్తే 12 గంటల్లో ప్రయాణించొచ్చు. ఎక్స్‌ప్రెస్‌ వేతో ప్రమాణ సమయం తగ్గుతుంది. ఇంధన ధర తగ్గుతుంది. అదే ఓ ట్రక్కు ముంబై నుంచి ఢిల్లీ చేరడానికి 48 గంటలు పడుతుంది. ఎక్స్‌ప్రెస్‌ వేతో ఎక్కువ ట్రిప్పులు తిరగొచ్చు. దాని ద్వారా వ్యాపారం మరింత చేసుకోవచ్చని తెలిపారు.తాను త‌న బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో రాజీ ప‌డ‌బోన‌ని ఆయ‌న అన్నారు. త‌న‌ పెళ్లైన కొత్తలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకుఉన్నారు. త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ రోడ్డు మధ్యలో ఇంటిని క‌ట్టుకున్నార‌ని, దీంతో దాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశానని గ‌డ్క‌రీ చెప్పారు. ఈ చ‌ర్య‌లు తన భార్య కాంచనకు తెలియకుండా తీసుకున్నాన‌ని అన్నారు.

    దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌ వేను ఢిల్లీ- ముంబై మధ్య నిర్మిస్తున్నారు. ఆరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న 1,380 కిలోమీటర్ల ఈ ఎక్స్‌ప్రెస్‌ వే పనులు 2023లో పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. నితిన్‌ గడ్కరీ హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తో కలిసి ఎక్స్‌ప్రెస్‌ వే పనులను పరిశీలించారు.

    Trending Stories

    Related Stories