తీవ్ర అస్వస్థతకు గురైన నితిన్ గడ్కరీ

0
668

ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిలిగురిలోని శివ మందిర్ నుండి సేవక్ కంటోన్మెంట్ వరకు రహదారికి శంకుస్థాపన చేయడానికి నితిన్ గడ్కరీ వచ్చారు. డార్జిలింగ్ జంక్షన్ సమీపంలోని దగాపూర్ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. వేదికపైనే కేంద్ర మంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కార్యక్రమం ఆగిపోయింది. గ్రీన్ రూంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. డార్జిలింగ్ లో నేషనల్ హైవేల శంకుస్థాపనకు హాజరైన సమయంలో స్టేజిపై ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు కార్యక్రమాన్ని ఆపేశారు. ఆయనను పక్కనన్న గ్రీన్ రూమ్ లోకి విశ్రాంతి కోసం తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. ఆయనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి సిలిగురి నుంచి సీనియర్ డాక్టర్ ను ఆగమేఘాలపై రప్పించారు. ఆయన ఆధ్వర్యంలో చికిత్స కొనసాగింది. డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్ గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రూ. 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు. సిలిగురిలో కార్యక్రమం ముగిసిన తర్వాత, ఆయన దల్ఖోలాకు వెళ్లాల్సి ఉంది. మూలాల ప్రకారం, ఆ ఈవెంట్ రద్దు చేశారు. నితిన్ గడ్కరీని సిలిగురి నుండి ఢిల్లీకి తీసుకుని రానున్నారు.