భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకుని వస్తూ ఉన్నారు. కానీ చాలా రాష్ట్రాలలో మోదీ తీసుకుని వచ్చిన పథకాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్టికర్లు వేసుకుంటూ ఉన్నాయి. మోదీ ప్రభుత్వం 75 సహాయం అందిస్తూ ఉంటే.. కొన్ని రాష్ట్రాలు మిగిలిన 25 శాతం పథకాలకు సాయం చేస్తూ.. మొత్తం తమదేనని చెప్పుకుంటూ ఉన్నాయి. ఇలాంటి పథకాలలో మోదీ ఫోటో తీసేసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు ఉండడాన్ని పదే.. పదే మనం గమనిస్తూ వస్తున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో ఏపీ నేతలను కడిగేశారు.
విశాఖపట్టణం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బంగారయ్యపేటలో ఉన్న రేషన్ డిపోను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. ఆమె వెళ్లిన డిపో దగ్గర ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో ఆమె రేషన్ డీలర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింద కేంద్రం బియ్యాన్ని ఉచితంగా అందిస్తోందని, అలాంటప్పుడు రేషన్ షాపు వద్ద ప్రధాని మోదీ ఫోటో లేకుండా బియ్యం ఎలా పంపిణీ చేస్తారని డీలర్‌ను ప్రశ్నించారు. వాహనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇంటికే బియ్యం సరఫరా చేస్తోందని జేసీ వేణుగోపాల్‌రెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్ నిర్మలకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం సంగతి ఇప్పుడెందుకని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యం, సరుకులు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు నిర్మలా సీతారామన్. కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ‘గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం’ గురించీ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ నాథ్‌ను వివరించమన్నారు. రేషన్ డిపోలలో ఎవరికి ఇష్టమొచ్చిన ఫోటోలు వారు పెడితే కుదరదు. ఏ అన్న ఫొటో ఉన్నా లేకున్నా.. ప్రతీ రేషన్ డిపోలో మన అందరి అన్న నరేంద్ర మోడీ ఫోటో ఉండాలని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.