చిత్తూరు జిల్లాలో ఒక అల్లరి మూక రెచ్చిపోయింది. పలమనేరులోని పాతపేటలో దారుణం జరిగింది. నిరంజన్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో గత రెండేళ్లుగా సొంతింట్లోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. ఇంటికి ఎదురుగానే ఒక ముస్లిం కుటుంబం ఉంటోంది. ఆ ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో.. ముస్లిం కుటుంబానికి నిరంజన్ కు మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. ఈ విషయంలో కాలనీవాసులు కూడా కలగజేసుకుని రెండు కుటుంబాలకు సర్దిచెప్పారు. నిరంజన్ ఇంట్లో అద్దెకు ఉండే ఒక మహిళ తరచూ ఎదురింటికి వెళ్లేది. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య విభేదాలున్నాయి.. వాళ్లింటికి వెళ్లడం మానుకో అని ఆమెకు చెప్పాడు నిరంజన్. అద్దెకుంటున్న మహిళ ఈ విషయాన్ని ఎదురింటి ముస్లిం కుటుంబానికి చేరవేసింది. దీన్ని జీర్ణించుకోలేక నిరంజన్ పై మూకుమ్మడి దాడికి దిగారు ముస్లిం ఫ్యామిలీ. ఇంటి గేటుపై నుంచి దూకి మరీ చితక బాదారు. అంతేకాదు..సుత్తితో కూడా దాడి చేశారు. ఇంటి ముందున్న సీసీ టీవీలో వాళ్ల దాష్టీకం మొత్తం రికార్డైంది.
దాడి తర్వాత సీసీ టీవీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని నిరంజన్ ఆవేదన చెందుతున్నాడు. తనపై హత్యా యత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నామ మాత్రపు కేసులు పెట్టారని ఆరోపిస్తున్నాడు బాధితుడు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధితుడు ఒక సెల్ఫీ వీడియో లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఈ దాడి వీడియో వైరల్ అవుతోంది. రోజు రోజుకు వాళ్ల ఆగడాలు శృతిమించుతున్నాయని మండిపడుతున్నారు నెటిజన్లు. నిరంజన్ కు రక్షణ కల్పించి.. దాడి చేసిన వారిని కఠింనంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.