National

భారత సైన్యంలో చేరిన పుల్వామా అమరవీరుడి భార్య నిఖిత

కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని దేశ ప్రజలెవరూ మరచిపోలేరు. ఆ దాడిలో అసువులు బాసిన ఆర్మీ మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ భార్య నిఖిత కౌల్ సైన్యంలో చేరారు. చెన్నైలో నేడు జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఆమె ఆర్మీ లెఫ్టినెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. అత్యంత కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆమెకు నార్తర్న్ కమాండ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి లాంఛనంగా భుజాలకు స్టార్లు అమర్చి సైన్యంలోకి తీసుకున్నారు. భర్త మరణం తర్వాత నిఖిత తాను చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాన్ని మానేసి.. సైన్యంలో ప్రవేశానికి షార్ట్ సర్వీస్ కమిషన్ రాతపరీక్ష రాశారు. అందులో ఉత్తీర్ణురాలు కావడంతో, సర్వీస్ సెలెక్షన్ కమిషన్ బోర్డు ఇంటర్వ్యూలోనూ సఫలం అయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆమెకు లెఫ్టినెంట్ హోదా కల్పిస్తూ ఆర్మీ నిర్ణయం తీసుకుంది.

Wife of Major Dhoundiyal Clears SSB Interview To Join Indian Army

తన భర్త చనిపోగానే నిఖిత కౌల్ క్రుంగి పోలేదు. భారత సైన్యంలో స్థానం సంపాదించాలని ఆమె అనుకుని.. అనుకున్నది సాధించింది. విభూతి శంకర్ దౌండియాల్ కు 2019 లో శౌర్య చక్ర అవార్డును కూడా ఇచ్చారు. తన భర్త చనిపోయిన ఆరు నెలలకు ఆమె సైన్యంలో చేరడానికి సంబంధించిన ప్రిపరేషన్లను మొదలు పెట్టింది. 2019 ఫిబ్రవరిలో చోటు చేసుకున్న పుల్వామా దాడుల్లో విభూతి శంకర్ దౌండియాల్ శరీరంలోకి తూటా దూసుకుని వెళ్లడమే కాకుండా తల, పొట్ట భాగంలో గాయాలు కూడా అయ్యాయి. శ్రీనగర్ లోని 92 బేస్ ఆసుపత్రిలోకి విభూతి శంకర్ దౌండియాల్ ను తీసుకుని రాగా.. అప్పటికే అతడు మరణించినట్లుగా వైద్యులు స్పష్టం చేశారు. ఆయన చనిపోయిన రెండు సంవత్సరాలకు ఆయన భార్య నిఖిత సైన్యంలో అడుగుపెట్టారు.

Wife Nikita Kaul Says I Love You For One Last Time During Teary Farewell Of Major  Dhoundiyal, Martyred In Pulwama Encounter - HungryBoo

ఆర్మీ మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ అమరుడైన సమయానికి ఆయన నిఖితను పెళ్లి చేసుకుని కేవలం 9 నెలలు మాత్రమే అయింది. ఆయన మరణం కారణంగా నిఖిత క్రుంగి పోలేదు. భారతదేశానికి సేవ చేయాలని ఆమె అనుకుంది. ఎలాగైనా భారత సైన్యంలో చేరాలని అనుకుంది. అనుకున్నట్లుగా సైన్యంలోకి వెళ్లాలంటే ఏయే పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలో.. వాటిపై దృష్టి సారించింది. నిఖిత తన భర్త ఆర్మీ మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ మరణించినప్పుడు అన్న వ్యాఖ్యలు దేశం మొత్తాన్ని ఎమోషనల్ చేశాయి. ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు. కానీ నా కన్నా నువ్వు ఈ దేశాన్ని ప్రేమిస్తున్నావు. నిజంగా నాకు ఎంతో గర్వంగా ఉంది. నీ జీవితంలో నువ్వు కలవలేని ఎంతో మంది కోసం నీ ప్రాణాన్నీ త్యాగం చేశావు. నువ్వు ఎంతో ధైర్యవంతుడివి. నీ భార్యనైనందుకు సంతోషిస్తున్నాను. నా చివరి శ్వాస వరకూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ ప్రాణం నీకోసమే’ అంటూ నిఖిత విభూతి శంకర్ దౌండియాల్ కు తుది వీడ్కోలు చెబుతున్నప్పుడు అన్న వ్యాఖ్యలు.

తన భర్త మరణించిన ఆరు నెలలకు ఆర్మీలో చేరడానికి సంబంధించి ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ప్రైవేటు ఉద్యోగాన్ని మానేసి.. సైన్యంలో ప్రవేశానికి షార్ట్ సర్వీస్ కమిషన్ రాతపరీక్ష రాశారు. అందులో ఉత్తీర్ణురాలు కావడంతో, సర్వీస్ సెలెక్షన్ కమిషన్ బోర్డు ఇంటర్వ్యూలోనూ సఫలం అయ్యారు. చెన్నైలో నేడు జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఆమె ఆర్మీ లెఫ్టినెంట్ గా బాధ్యతలు స్వీకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

17 + sixteen =

Back to top button