More

    చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి

    నైజీరియాలో ఉగ్రవాదులు చర్చిపై విరుచుకుపడ్డారు. ఆదివారం నాడు ఓ చర్చిపై కాల్పులు జరపడంతో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రాగా.. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిపై దాడికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వారు ఎవరు.. ఎందుకు ఈ మారణహోమానికి పాల్పడ్డారు అనే విషయం తెలియలేదు. ఈ దాడిలో బిషప్, పాస్టర్లు క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు చెప్పారు. ఓవోలోని రెండు ఆసుపత్రులకు 50 మృతదేహాలకు పైగా తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మదు బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిక్ తిరుగుబాటుతో పోరాడుతోంది. డబ్బుల కోసం దాడులు మరియు కిడ్నాప్‌లను నిర్వహించే సాయుధ ముఠాలు ఎక్కువగా వాయువ్య ప్రాంతంలో ఉన్నాయి. నైరుతిలో, ఇటువంటి దాడులు చాలా అరుదు.

    Trending Stories

    Related Stories