More

    లష్కరేకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసిన NIA అధికారి అరెస్ట్

    ఎన్ఐఏలోనే రహస్య పత్రాల లీకేజి ఘటనపై అరెస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎన్ఐఏలో పనిచేసిన అధికారి లష్కరే తీవ్రవాదులకు సమాచారం అందిస్తూ వచ్చాడనే ఆరోపణలు నమోదయ్యాయి. పాక్ ఆధారిత ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూపులకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసినందుకు ఎన్ఐఏలో పనిచేసిన ఒక ఐపీఎస్ అధికారిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. హిమాచల్ ఐపీఎస్ అధికారి, మాజీ ఎన్‌ఐఏ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగి లష్కరే తోయిబాకు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.

    గ్యాలంట్రీ అవార్డు గెలుచుకున్న సదరు పోలీసు అధికారి, లష్కర్‌కు చెందిన ఓ ఓవర్‌గ్రౌండ్ ఆపరేటివ్ ఖుర్రం పర్వేజ్‌కు రహస్య సమాచారాన్ని లీక్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) నుండి వచ్చిన సమాచారంతో విచారణను ఎదుర్కొంటూ ఉన్నాడు. మానవ హక్కుల కార్యకర్తగా నటించిన ఖుర్రం పర్వేజ్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అరెస్టు చేశారు. లష్కరే నెట్ వర్క్ వ్యాప్తికి సంబంధించి అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు గతంలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఐపీఎస్ అధికారి అరవింద్ నేగి అరెస్ట్ సందర్భంగా ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు జరిపారు. అధికారిక రహస్యపత్రాలను లష్కరే ఉగ్రవాద సంస్థకు లీక్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

    గూఢచర్యం, దోపిడీ, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు IPS అధికారి విచారణలో ఉన్నారు. NIA ప్రకారం, లష్కరే తోయిబా “ఓవర్‌గ్రౌండ్ వర్కర్ నెట్‌వర్క్”పై పరిశోధనలకు సంబంధించి నేగీ రహస్య ఫైళ్ళను లీక్ చేసాడు. నవంబర్ 2021లో ఏజెన్సీ నమోదు చేసిన ఈ కేసులో నేగీకి ముందు, ఆరుగురు వ్యక్తులు ఇప్పటికే అరెస్టు చేయబడ్డారు. అరవింద్ దిగ్విజయ్ నేగి ఎన్‌ఐఏకు డిప్యూటేషన్‌పై ఉన్నప్పుడు అనేక ఉగ్రవాద సంబంధిత కేసులను దర్యాప్తు చేశారు. అతను NIAలో SP ర్యాంక్ అధికారి. ఉగ్రవాద నిధులు, ISIS రిక్రూట్‌మెంట్, నకిలీ కరెన్సీ మొదలైన వాటికి సంబంధించిన వివిధ కేసులను విచారించాడు.

    Trending Stories

    Related Stories