More

    డబ్బులు వసూలు చేయనున్న ఫోన్ పే.. కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్..!

    ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు తీసుకుని వస్తూ ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్లను వాట్సాప్ తీసుకుని వస్తోంది. యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఆడియో మెసేజ్ ప్రివ్యూ, వాట్సాప్ కమ్యూనిటీ, వాట్సాప్ ప్లేయర్, మీడియా అన్ డు, మల్టీ డివైస్ సపోర్ట్ వంటివి తీసుకుని వస్తోంది. వాట్సాప్ లో ఆడియో సందేశాలు పంపే విషయంలో ఆడియో మెసేజ్ ప్రివ్యూ ఫీచర్ ను వాట్సాప్ తీసుకువస్తోంది. ఆడియో సందేశం రికార్డు చేసిన తర్వాత దాన్ని మనం విని కొన్ని మార్పులతో పంపొచ్చు. వాట్సాప్ లో పంపించే ఆడియో సందేశాలు వినేందుకు ప్లేయర్ ఫీచర్ లో మార్పులు చేస్తోంది వాట్సాప్ యాజమాన్యం. యూజర్లు పెద్ద సైజులో ఉండే ఆడియో సందేశాలను వింటూనే చాటింగ్ చేసే వెసులుబాటు ఈ ప్లేయర్ ఫీచర్ తో కలుగుతుంది. ఆడియో మెసేజ్ ను యూజర్లు పిన్ చేసి.. ఆ తర్వాత ప్లే చేస్తూ, ఇతరులతో చాట్ చేసుకోవచ్చు.

    ఒకే వాట్సాప్ ఖాతాను రెండు ఫోన్లలో ఉపయోగించుకునేలా మల్టీ డివైస్ సపోర్ట్ ఫీచర్ తీసుకువస్తోంది .ఈ ఫీచర్ సాయంతో ఒకే వాట్సాప్ ఖాతాను ఫోన్ లోనూ, ట్యాబ్, డెస్క్ టాప్ పీసీలోనూ ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇది బేటా వెర్షన్ లో ఉంది. గ్రూప్ ఫీచర్ తో పాటూ కమ్యూనిటీ ఫీచర్ కూడా సందడి చేయనుంది. యూజర్లు ఓ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకుని, అందులోనే గ్రూప్ లను కూడా ఏర్పాటు చేసుకునే సౌలభ్యం దీనివల్ల కలుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఫీచర్లను తీసుకుని వస్తామని వాట్సాప్ అంటోంది.

    షాకిచ్చిన ఫోన్ పే:

    భారతీయులు ఇటీవలి కాలంలో ఎక్కువ ఉపయోగిస్తున్న యూపీఐ యాప్ ఫోన్ పే అనే సంగతి తెలిసిందే..! పలు యూపీఐ యాప్ ల కంటే ఈ యాప్ నే భారతీయులు ఉపయోగిస్తూ ఉన్నారు. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తన యూజర్లకు తెలిపింది. ప్రాసెసింగ్ ఫీ పేరుతో వినియోగదారుల నుంచి రుసుము వసూలు చేసేందుకు ఫోన్‌పే సిద్ధమైంది. రూ. 50 పైన చేసే మొబైల్ రీచార్జ్‌లపై రూ. 1-2 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది. యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించడం మొదలుపెట్టిన తొలి సంస్థగా ఫోన్‌పే నిలిచింది. 50 రూపాయల లోపు చేసే రీచార్జ్‌లు మాత్రం పూర్తిగా ఉచితమని చెబుతున్నారు. ఆపై 100 రూపాయల వరకు రూపాయి, అది దాటితే రూ. 2 వసూలు చేస్తామని ఫోన్‌పే తెలిపింది. గత నెలలో ఏకంగా 165 కోట్ల యూపీఐ లావాదేవీలు నిర్వహించింది. ఇతర డిజిటల్ చెల్లింపు యాప్‌లు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నామని.. కేవలం ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారులపైనే వసూలు చేస్తామని ఫోన్ పే సంస్థ తెలుపుతోంది. దీనిపై వినియోగదారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

    Trending Stories

    Related Stories