తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ నూతన మండలాల ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త మండలాలు
- గట్టుప్పల్(నల్లగొండ)
- కౌకుంట(మహబూబ్‌నగర్)
- ఆలూర్(నిజామాబాద్)
- సాలూర(నిజామాబాద్)
- డొంకేశ్వర్(నిజామాబాద్)
- సీరోల్(మహబూబాబాద్)
- నిజాంపేట్(సంగారెడ్డి)
- డోంగ్లీ(కామారెడ్డి)
- ఎండపల్లి(జగిత్యాల)
- భీమారం(జగిత్యాల)
- గుండుమల్(నారాయణపేట్)
- కొత్తపల్లె(నారాయణపేట్)
- దుడ్యాల్(వికారాబాద్)