More

  న్యూజిలాండ్ ను పాకిస్థాన్ నిలువరించేనా..?

  T20 ప్రపంచ కప్ 2022 మొదటి సెమీఫైనల్ నవంబర్ 9న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో న్యూజిలాండ్ – పాకిస్థాన్ మధ్య జరగనుంది. పాకిస్థాన్ జట్టు అనూహ్యంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ గ్రూప్ 1లో మంచి విజయాలను సాధించి దూసుకువచ్చింది. గ్రూప్ లో టాపర్ గా నిలిచింది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ ICC ఈవెంట్‌లలో బాగా రాణిస్తున్న సంగతి తెలిసిందే..! అయితే టైటిల్స్ ను మాత్రం సొంతం చేసుకోవడం లేదు. ఈసారి మాత్రం టైటిల్‌ను ఎగరేసుకుపోవాలని ఆశిస్తున్నారు.

  ఈ ప్రపంచకప్‌లో వర్షం పలు జట్లకు చాలా పెద్ద విలన్ గా మారింది. సెమీఫైనల్‌లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం, నవంబర్ 9 న సిడ్నీలో వాతావరణం క్లియర్ గానే ఉంటుంది, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 23 డిగ్రీల వరకు ఉంటాయి. రోజంతా వర్షం పడే అవకాశం కేవలం 20% మాత్రమే ఉంది. Accuweather ప్రకారం, వర్షం పడే అవకాశాలు 0% ఉన్నాయి. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోని పిచ్ ఇప్పటివరకు ప్రపంచకప్‌లో మంచి బ్యాటింగ్ ట్రాక్ గా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మంచి విజయాన్ని సాధించాయి, కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ట్రెండ్‌ను కొనసాగించవచ్చు.

  న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్

  పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), మహ్మద్ నవాజ్, మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వాసిం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, హైద్ హస్నైన్ అలీ, ఆసిఫ్ అలీ

  మ్యాచ్ అధికారులు: మరైస్ ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో (థర్డ్ అంపైర్), క్రిస్ బ్రాడ్ (మ్యాచ్ రిఫరీ).

  Trending Stories

  Related Stories