టాస్ కూడా పడకుండానే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు

0
633

భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో నిర్వహించాలని భావించారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. ఉదయం నుండి వెల్లింగ్టన్ లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. కనీసం కనీసం టాస్ కూడా పడలేదు. నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్ లకే పరిమితం అయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈ నెల 20న, మూడో మ్యాచ్ 22న జరగనుంది.