టీ20 ప్రపంచ కప్ సూపర్-12.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

0
803

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్-12 మ్యాచ్ మొదలవనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ల మధ్య ఈ మ్యాచ్ మొదలు కానుంది. గతేడాది టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఈ రెండు జట్లే తలపడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. డిస్నీ+హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే(w), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్