వ్యాక్సినేషన్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగి సర్కార్..!

0
745

వ్యాక్సినేషన్ విషయంలో యోగి సర్కార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆగస్టు 3 న యోగి ప్రభుత్వం 25 లక్షల మందికి టీకాలు వేయడం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డును సృష్టించింది. అంతేకాకుండా మొత్తంగా 5 కోట్ల వ్యాక్సిన్లను వేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. మంగళవారం నాడు 22 లక్షల డోస్‌ల మైలురాయిని దాటినందుకు అధికారులు మరియు రాష్ట్ర ప్రజలకు ఉత్తర ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలు చురుకుగా పాల్గొన్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతు లేకుండా ఈ మైలురాయిని సాధించడం సాధ్యం కాదని హిందీలో యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. సాయంత్రానికి 25 లక్షలకు పైగా వ్యాక్సిన్లను యోగి ప్రభుత్వం ప్రజలకు వేసింది.

కోవిడ్ -19 ను అంతం చేయడానికి వ్యాక్సిన్ మీ ఏకైక “సురక్ష కవాచ్” (భద్రతా కవచం) అని ప్రజలకు తెలియజేస్తూ యోగి ఆదిత్యనాథ్ తన ట్వీట్ లో వెల్లడించారు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని.. కరోనా మహమ్మారిని ఓడించడంలో సహాయపడాలని కోరారు. ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం టీకాల విషయంలో రికార్డును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజులో 20 లక్షల కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెగా వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో 12,000 టీకా కేంద్రాలు పనిచేశాయి.

జూన్ 1 నుంచి భారీగా కోవిడ్ టీకా డ్రైవ్ ను మొదలు పెట్టాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు సూచించారు. ‘మిషన్ జూన్’ ప్రకటించిన తరువాత యోగి ఆదిత్యనాథ్ జూన్ 4 న రాష్ట్ర రోజువారీ కోవిడ్ -19 టీకా రేటును ఒక నెలలో మూడు రెట్లు పెంచాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు పని చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్లను అందించగానే ప్రజలకు వ్యాక్సిన్లను ఇచ్చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here