More

    8 మంది కొత్త గవర్నర్ల ప్రకటన.. మిజోరాం గవర్నర్‌గా కంభపాటి హరిబాబు

    భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పలు 8 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఆదేశాలను జారీ చేశారు. కర్ణాటక, హర్యానాతో సహా ఎనిమిది రాష్ట్రాలకు మంగళవారం కొత్త గవర్నర్లు వచ్చారు. ఈ నియామకాలు వారు తమ కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి అమలులోకి వస్తాయి. కేంద్ర మంత్రి, బిజెపి రాజ్యసభ నాయకుడు తవర్‌చంద్ గెహ్లాట్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌కు చెందిన డాక్ట‌ర్ కంభ‌పాటి హ‌రిబాబు మిజోరాం గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. బండారు ద‌త్తాత్రేయ‌ను హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌గా బ‌దిలీ చేశారు. మ‌ధ్య ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా మంగుభాయ్ ఛ‌గ‌న్‌భాయ్ ప‌టేల్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్‌ను, క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్‌గా తావ‌ర్చంద్ గెహ్లాట్‌నూ నియ‌మిస్తూ రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. మిజోరాం గ‌వ‌ర్న‌ర్ పి.ఎస్‌. శ్రీ‌ధ‌ర‌న్ పిళ్ళైను గోవా గ‌వ‌ర్న‌ర్‌గానూ, హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌దేవ్ నారాయ‌ణ్ ఆర్య‌ను త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గానూ, త్రిపుర గ‌వ‌ర్న‌ర్ ర‌మేశ్ బ‌సిస్‌ను జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గానూ బ‌దిలీ చేశారు.

    మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. దీంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్ నుంచి హర్యానాకు బండారు దత్తాత్రేయ బదిలీ అయ్యారు. కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్‌ (ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు), గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌ నియమితులయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముందే కేంద్రం గవర్నర్ల నియామకాలను జరిపింది. పైన పేర్కొన్న నియామకాలు వారు తమ కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కార్యాలయం తెలిపింది.

    Related Stories