More

    13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు.. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, బాలాజీ జిల్లాలు..!

    ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉగాది నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త జిల్లాలకు అల్లూరి సీతారామరాజు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కోనసీమ వంటి పేర్లు కూడా ఉన్నాయి.

    ఇకపై ఏపీలోని జిల్లాలు – వాటి రాజధానులు ఇలా..
    శ్రీకాకుళం – శ్రీకాకుళం
    విజయనగరం – విజయనగరం
    మన్యం జిల్లా – పార్వతీపురం
    అల్లూరి సీతారామరాజు – పాడేరు
    విశాఖపట్టణం – విశాఖపట్టణం
    అనకాపల్లి – అనకాపల్లి
    తూర్పుగోదావరి – కాకినాడ
    కోనసీమ – అమలాపురం
    రాజమహేంద్రవరం – రాజమహేంద్రవరం
    నరసాపురం – భీమవరం
    పశ్చిమ గోదావరి – ఏలూరు
    కృష్ణా – మచిలీపట్నం
    ఎన్‌టీఆర్ జిల్లా – విజయవాడ
    గుంటూరు – గుంటూరు
    బాపట్ల – బాపట్ల
    పల్నాడు – నరసరావుపేట
    ప్రకాశం – ఒంగోలు
    ఎస్‌పీఎస్ నెల్లూరు – నెల్లూరు
    కర్నూలు – కర్నూలు
    నంద్యాల – నంద్యాల
    అనంతపురం – అనంతపురం
    శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి
    వైఎస్సార్ కడప – కడప
    అన్నమయ్య జిల్లా – రాయచోటి
    చిత్తూరు – చిత్తూరు
    శ్రీ బాలాజీ జిల్లా – తిరుపతి

    నందమూరి తారకరామరావు పేరును కొత్త జిల్లాల్లో ఒకదానికి పెట్టారు. ఎన్టీఆర్ ను గౌరవించిన విధానం బాగానే ఉంది. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతాన్ని కృష్ణా జిల్లాగా ఉంచి, ఆయన పేరును విజయవాడ ప్రాంతంలో పెట్టడం పై అభ్యంతరాలు వస్తున్నాయి. నందమూరి తారకరామారావు పుట్టింది పామర్రు నియోజకవర్గంలోని నిమ్మకూరు గ్రామం. ఈ ప్రాంతం మాత్రం కృష్ణా జిల్లాలోనే ఉంది. విజయవాడ కేంద్రంగా చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు కానున్ను జిల్లాలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతానికే ఆయన పేరు పెడితే బాగుంటుందని, మార్పులు చేయాలని అంటున్నారు.

    Trending Stories

    Related Stories