Uncategorized

టీటీడీ పాలకవర్గ భేటీలో కీలక నిర్ణయాలు

నేడు టీటీడీ పాలకవర్గ భేటీ నిర్వహించారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని.. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలను సమర్పిస్తారన్నారు. భక్తుల రద్దీ తగ్గే వరకు సర్వదర్శన భక్తులుకు ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తామని అన్నారు. సర్వదర్శన భక్తులకు స్లాటడ్ విధానంలో టోకేన్లు కేటాయింపు పై అధ్యయనం చేస్తున్నామన్నారు సుబ్బారెడ్డి.

దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు:

దేశవ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది పాలకమండలి. ఆగస్ట్ 16 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులో వైభోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 7.32 కోట్లతో యస్వీ గోశాలకు పసుగ్రాసం కోనుగోలు చేయాలని, 2.7 కోట్లతో పార్వేటి మంటపం నూతన నిర్ణయం చేస్తామన్నారు. 154 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు చేయనున్నామన్నారు. 2.9 కోట్లతో అమరావతిలో ఆలయం వద్ద పచ్చదనం అభివృద్ది చేయనున్నారు.

మరిన్ని నిర్ణయాలు:
*ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయం
*ఆగమపండితులు సలహ మేరకు నెల రోజులు తరువాత పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు
*అక్టోపస్ కోసం కేటాయించిన భవన నిర్మాణం కోసం అదనంగా 7 కోట్లు కేటాయింపు
*తిరుమలలోని యస్వీ పాఠశాలలో ఉన్నతప్రమాణాలతో విద్య
*సింఘానియా గ్రూప్ తో ఒప్పందం చేసుకుంది.
*18 లక్షలతో బేడి ఆంజనేయస్వామి కి బంగారు కవచం
*చెన్నైలో రూ.6 కోట్లు,బెంగళురులో రూ.3.23 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చిన భక్తులు అందించారు.
*భక్తులకు అందుబాటులోకి ఈ ఏడాది 33 లక్షల క్యాలండర్లు
*ప్రతి నెల 2.1 లక్షల సప్తగిరి మాస పత్రిక ముద్రణ
*యంత్రాల సాయంతో లడ్డు ప్రసాదం బూందీ తయారీపై అధ్యయనం
*ప్రసాదాల తయారీకి వినియోగించే ఆర్గానిక్‌ ముడిసరుకుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ తో ఒప్పందం

Related Articles

Back to top button