More

  కాంగ్రెస్ కు ఒక్కో నెటిజన్ ఇస్తున్న కౌంటర్లు చూస్తే..!

  అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ ఆసియాలో రెండవ ధనవంతుడుగా నిలిచిన సంగతి తెలిసిందే..! గత ఒక సంవత్సరంలో, ఆయన ప్రతిరోజూ రూ .1,002 కోట్లు సంపాదించారు. ప్రస్తుతం అతని ఆస్తులు 5.05 లక్షల కోట్లు. ఒక సంవత్సరం క్రితం, ఆయన ఆస్తులు రూ .1.40 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు 5 లక్షలకు పైగానే చేరింది. ఇక ముకేశ్ అంబానీ గత ఒక సంవత్సరంలో ప్రతిరోజు రూ .163 కోట్లు సంపాదించారు. ఆయన సంపద 9%పెరిగింది. ఆయన ఆస్తులు ప్రస్తుతం రూ. 7.18 లక్షల కోట్లు. అంబానీతో పోలిస్తే, గత ఒక సంవత్సరంలో అదానీ రోజుకు 6 సార్లు కంటే ఎక్కువ సంపాదించారు. ఐఐఎఫ్ఎల్ (IIFL) వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, గౌతమ్ అదానీ సంపద ఏడాదిలో దాదాపు 4 రెట్లు పెరిగింది. దీంతో అదానీ మళ్లీ ఆసియాలో రెండవ ధనవంతుడైన వ్యాపారవేత్త అయ్యారు. ఈ సంవత్సరం మేలో, ఆయన ఆసియాలో రెండవ ధనిక వ్యాపారవేత్త అయ్యారు. గ‌తేడాది కొత్త‌గా 58 మంది బిలియ‌నీర్లు చేరారు. దీంతో భారతదేశంలో 2020-21లో మొత్తం బిలియ‌నీర్ల సంఖ్య 258కి చేరింది. ఇక ఇండియాలో యంగెస్ట్ బిలియ‌నీర్‌గా భారత్‌ పే పేమెంట్స్ యాప్ కోఫౌండ‌ర్ శాశ్వ‌త్ న‌క్రానీ నిలిచారు.

  అదానీతో భారతీయ జనతా పార్టీ స్నేహం గురించి కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. భారతీయ జనతా పార్టీకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటే రోజుకు 1000 కోట్ల రూపాయలు ఆర్జించవచ్చుననే అర్థం వచ్చేలా ఓ ట్వీట్ వేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ పోస్టు కింద నెటిజన్లు కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగిపోయే కౌంటర్లు వేస్తూ ఉన్నారు.

  ఎంతో మంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కౌంటర్లు వేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాబర్ట్ వాద్రాకు ఎంత ఆస్తులు పెరిగాయో చెప్పమంటారా అంటూ పలువురు లెక్కలతో సహా పోస్టులు పెడుతూ ఉన్నారు. సోనియా గాంధీ ఆస్తులు, బినామీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటూ మరొకరు పోస్టు పెట్టారు. ’70 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ భారత్ లోని ఆస్తులను వనరులను ఎలా తినేసిందో అందరికీ తెలుసు’ అంటూ మరొక వ్యక్తి ట్వీట్ చేశారు.

  ప్రస్తుతం మీ చేతుల్లోకి ఏమీ రావడం లేదని డైరెక్ట్ గా చెప్పేయొచ్చు కదా అని మరొక నెటిజన్ కాంగ్రెస్ నాయకుల ఫోటోలను పోస్టు చేసి విమర్శించారు. ఇంకొందరైతే అదానీతో రాబర్ట్ వాద్రా ఉన్న ఫోటోను పోస్టు చేసి.. మీకు ఎటువంటి సంబంధం లేదా అని కూడా ప్రశ్నించారు. రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అదానీతో డీల్ చేసుకున్న విషయం ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. మరొక కామెంట్ ఏమిటంటే ‘2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి రాబర్ట్ వాద్రా దేశంలోనే ధనికుడు అయి ఉండేవాడు’ అంటూ మరో పంచ్ వేశారు నెటిజన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అదానీకి టెండర్లు ఇచ్చాయని.. అనవసరంగా భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేయడానికి ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటూ మరికొందరు విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎన్నో కామెంట్లు కాంగ్రెస్ పార్టీ పెట్టిన ట్వీట్ కింద చూడొచ్చు.

  Trending Stories

  Related Stories