వన్డే క్రికెట్ లో ఇంగ్లండ్ రికార్డు.. 50 ఓవర్లలో 498 పరుగులు

0
881

వన్డే క్రికెట్ లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డును సాధించింది. పసికూన నెదర్లాండ్స్ మీద 50 ఓవర్లలో 498 పరుగుల స్కోరును సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న నెదర్లాండ్స్ బౌలర్లను ఫిలిప్ సాల్ట్, డేవిడ్ మలాన్, బట్లర్, లివింగ్స్టన్ లు ఓ ఆటాడేసుకున్నారు. ఓపెనర్ జేసన్ రాయ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగినా.. ఫిలిప్ సాల్ట్ కు డేవిడ్ మలాన్ తోడయ్యాడు. మలాన్ 109 బంతుల్లో 125 పరుగులు చేయగా.. సాల్ట్ 93 బంతుల్లో 122 పరుగులు చేశాడు. బట్లర్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 70 బంతుల్లో 162 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ సాధిస్తాడని అభిమానులు అనుకోగా.. నిరాశ పరిచాడు. బట్లర్ ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు ఉన్నాయి. మోర్గాన్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగగా.. ఆఖర్లో లివింగ్స్టన్ ఊచకోత కోశాడు. 22 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అందులో 6 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. నిర్ణీత 50 ఓవర్లలో 498 పరుగులు చేసి వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సాధించింది. బట్లర్‌ను 37 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను మూసా అహ్మద్ వదిలేశాడు. దీంతో ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోకతప్పలేదు. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన ఈ మ్యాచ్ ల బెయిర్‌స్టో, స్టోక్స్ వంటి లేనప్పటికీ భారీ స్కోరు సాధించింది ఇంగ్లండ్.