More

    ఘోర బస్సు ప్రమాదం.. 32 మంది దుర్మరణం

    నేపాల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్​లోని ముగు జిల్లాలో ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నేపాల్‌గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు పినా ఝ్యారీ నదిలో పడింది. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయదశమి కోసం ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. కొండ ప్రాంతంలో ప్రయాణీకులతో నిండిన ప్యాసింజర్ బస్సు రోడ్డుపై నుండి లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మారుమూల ముగు ప్రాంతంలో బస్సు ముందు టైర్లలో ఒకదానికి పంక్చర్ కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు జిల్లా అధికారి రోమ్ బహదూర్ మహత్ చెప్పారు. బస్సు దక్షిణ బాంకే జిల్లా నుండి ముగు ప్రాంతానికి వెళ్తోంది. హిందూ పండుగ దశైన్ పండుగను జరుపుకోవడానికి చాలా మంది ప్రయాణిస్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో కనీసం 45 మంది ప్రయాణిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇంకొంత మంది గాయపడినట్లు చెప్పారు. గాయపడినవారిని చికిత్స కోసం హెలికాప్టర్లు ద్వారా ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద స్థలంలో ప్రాణాలతో బటపడ్డవారిని, బాధితుల కోసం పోలీసులు స్థానికుల సహాయంతో వెతుకుతూనే ఉన్నారు.

    Trending Stories

    Related Stories