నెల్లూరులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చేసిన దాడిలో కుళ్లిపోయిన చికెన్ విక్రయాలు కలకలం రేపాయి. జిల్లా వైద్యశాఖ అధికారి, నగర వైద్యాధికారి జరిపిన జాయింట్ ఆపరేషన్లో ఈ మాంసం విక్రయాలు వెలుగు చూశాయి. చెన్నై నుంచి నెల్లూరుకు దిగుమతి అవుతున్న కోడి మాంసం వాహనాన్ని తనిఖీలు చేసిన అధికారులు అక్రమంగా దిగుమతి చేస్తున్న 300 కేజీల కోడి మాంసం సీజ్ చేశారు. ఆరిఫ్ అనే వ్యాపారి ఈ కుళ్ళిన కోడి మాంసం దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.