More

    ఫోన్‎పే పేరిట ఘరానా మోసం

    నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆధునిక టెక్నాలజీతో ఫోన్‎పే పేరిట మోసానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరులో ముగ్గురు యువకులు ఫోన్‎పేలో డబ్బులు వేస్తున్నట్టు మెసేజ్ వచ్చేలా చేసి వ్యాపారుల నుండి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే తమ అకౌంట్లలో డబ్బులు పడని విషయాన్ని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత మూడు రోజులుగా వివిధ షాపుల్లో మోసాలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు పోలీసుస్టేషన్‎కు క్యూ కట్టారు. నిందితులు ఆత్మకూరులోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి మోసాలు పాల్పడినట్లు సమాచారం.

    Trending Stories

    Related Stories