More

    నెల్లూరులో ఏసీబీ రైడ్స్

    నెల్లూరు జిల్లాలో గత నెల వెలుగు చూసిన పౌరసరఫరాలశాఖ కుంభకోణంలో ప్రధాన పాత్రదారుల నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరు పౌరసరఫరాలశాఖలో జరిగిన 30కోట్ల రూపాయల కుంభకోణంపై విచారణ చేపట్టిన జాయింట్ కలెక్టర్ ప్రధాన సూత్రదారులను గుర్తించి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పౌరసరఫరాలశాఖ నెల్లూరు డిపో మేనేజర్‎తో పాటు మరో ఆరుగురి ప్రమేయం ఇందులో ఉన్నట్టు గుర్తించారు. అనంతరం కేసును ఏసీబీకి బదలాయించారు. దీంతో కేసులోని ప్రధాన నిందితుల ఇళ్లపై దాడులు చేసిన ఏసీబీ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. 2021లో మొదలైన ఈ కుంభకోణం 2022లో వెలుగు చూసింది. దాదాపు 30కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు తమ విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు.

    Trending Stories

    Related Stories