National

కేరళ వాసులకు నెగటివ్ రిపోర్టు ఉంటేనే ఎంట్రీ

కేరళలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! కట్టడి చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేరళ నుండి వచ్చే ప్రయాణికుల కోసం కర్ణాటక రాష్ట్రం సరికొత్త నిబంధనలు తీసుకొని వచ్చారు. గురువారం (జూలై 1) ప్రత్యేక నిఘా చర్యలను జారీ చేసింది. 72 గంటలకు మించని ఆర్టీ-పిసిఆర్ పరీక్ష నివేదికను చూపించాలని.. కోవిడ్ వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదు వేసుకున్న టీకా సర్టిఫికేట్ ను తప్పనిసరిగా చూపించాలని కోరారు. కేరళ నుండి విమాన, బస్సు, రైలు, టాక్సీ, వ్యక్తిగత రవాణా లేదా మరే ఇతర రవాణా విధానం ద్వారా ప్రవేశిస్తున్న వారికి ఈ తాజా మార్గదర్శకాలు వర్తిస్తాయి.

కొత్త సర్క్యులర్ ప్రకారం కేరళలోని కొన్ని జిల్లాల్లో డెల్టా + వేరియంట్ ఉందని భారత SARS-CoV-2 జెనోమిక్ కన్సార్టియం (INSACOG) తెలియజేసింది. దీంతో కేరళ ప్రయాణీకుల విషయంలో కర్ణాటక కొత్త మార్గదర్శకాలతో ముందుకు వచ్చింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. “మహమ్మారి పరిస్థితి ఉన్నందున రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోకి వ్యాపించకుండా ఉండటానికి ప్రత్యేక నిఘా చర్యలు తీసుకోవాలి, అందువల్ల తాజా మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి” అని కర్ణాటక ప్రభుత్వం సర్క్యులర్ లో తెలిపింది.

కేరళ సరిహద్దులో ఉన్న దక్షిణ కన్నడ, కొడగు, మైసూరు, చామరాజనగర జిల్లాల డిప్యూటీ కమిషనర్లు (డిసిలు) కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలన్నీ నియమాలను పాటించేలా తనిఖీ చేయడానికి అదనపు సిబ్బందిని చెక్ పోస్టుల వద్ద మోహరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.

72 గంటలు మించని నెగటివ్ RT-PCR పరీక్షల నివేదికలను కలిగి ఉన్న ప్రయాణీకులకు మాత్రమే విమానయాన సంస్థలు, రైల్వేలు మరియు ప్రభుత్వ రవాణా కార్పొరేషన్ అధికారులు బస్సులు లేదా రైల్వేలలో బోర్డింగ్ పాస్లు జారీ చేస్తారని తెలిపారు. కనీసం ఒక మోతాదు టీకాలు వేసినట్లు ధృవీకరణ పత్రం ఉంటేనే కర్ణాటక లోకి ఎంట్రీకి అనుమతి ఇవ్వనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

nine + 19 =

Back to top button