ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అమెరికాలోని యుజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఫైనల్ చేరుకున్నాడు. గ్రూప్-ఏ క్వాలిఫికేషన్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్కు దూసుకెళ్లాడు. స్టాక్హోమ్లో జరిగిన డైమండ్ లీగ్లో 89.94 మీటర్ల దూరం విసిరి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించాడు నీరజ్. గ్రూప్ A నుండి క్వాలిఫైయింగ్కు వెళ్లిన మొదటి అథ్లెట్ గా చోప్రా నిలిచాడు. 83.50 మీటర్ల క్వాలిఫైయింగ్ మార్క్ అతనికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. ఏకంగా 88.39 మీటర్లకు విసిరాడు. ఆదివారం ఉదయం ఫైనల్స్ లో ఏమి జరుగుతుందో చూడాలి.