More

    నీరజ్ చోప్రా కోచ్ పై వేటు

    టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే..! నీరజ్ చోప్రా కోచ్ ఉవే హూన్‌ పై వేటు వేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారితో పనిచేయడం చాలా కష్టం అని ఉవే హూన్‌ గత జూన్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా అతడిపై వేటుకు ఒక కారణమని అంటూ ఉండగా.. హూన్‌ దగ్గర శిక్షణ పొందిన నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధించగా.. మరో ఇద్దరు శివపాల్‌ సింగ్‌, అన్నూ రాణిలు ఉత్త చేతులతో తిరిగొచ్చారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఆయన్ను వదులుకోవడమే బెటర్ అని భావించింది. అంతేకాకుండా నీరజ్ చోప్రా కూడా ఉవే హూన్ వద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

    కోచ్‌లు, అథ్లెట్ల పనితీరు, ప్రదర్శనపై సమీక్ష అనంతరం జావెలిన్‌ త్రో కోచ్‌ పదవి నుంచి ఉవే హూన్‌ను తొలగించాలని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య నిర్ణయించింది. ఆయన స్థానంలో నీరజ్‌ చోప్రాకు టోక్యో ఒలింపిక్స్‌లో బయోమెకానికల్‌ నిపుణుడిగా సేవలందించిన క్లాస్‌ బార్టోనియెట్జ్‌ను నియమించారు. మరో ఇద్దరు కోచ్‌లను తీసుకురావడంపై కూడా ఏఎఫ్‌ఐ చర్చించిందని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు అడిల్లే సుమారివల్లా తెలిపారు. నీరజ్‌ చోప్రాకు కోచింగ్‌ ఇచ్చేందుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఉవే హూన్‌ ను 2017 లో నియమించింది. 2018 ఆసియా గేమ్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో నీరజ్‌ చోప్రా గోల్డ్‌ మెడల్స్‌ సాధించడంలో ఉవే హూన్‌ పాత్ర ఎంతో ఉన్నది. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే జట్టు కోసం జాతీయ జావెలిన్‌ కోచ్‌గా ఉవే హూన్‌ను కొనసాగించారు. హూన్‌ దగ్గర శిక్షణ పొందిన నీరజ్‌ చోప్రా బంగారు పతకం సాధించగా.. మరో ఇద్దరు శివపాల్‌ సింగ్‌, అన్నూ రాణిలు ఎటువంటి ప్రభావం చూపలేదు. సోమవారం నాటి సమీక్ష సమావేశంలో ఉవే హూన్‌ కింద శిక్షణ పొందేందుకు నీరజ్‌ చోప్రాతో పాటు శివపాల్‌ సింగ్‌, అన్నూ రాణిలు విముఖత చూపారని ఏఎఫ్‌ఐ ప్లానింగ్‌ మిషన్‌ చీఫ్‌ లలిత్‌ కే భానోత్‌ తెలిపారు. జావెలిన్‌కు మరో ఇద్దరు కోచ్‌లు అవసరమని, మంచి కోచ్‌ను తీసుకురావడం కష్టమైనప్పటికీ కనీసం ఒక్కరినైనా నియమించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

    స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారితో పనిచేయడం చాలా కష్టం అని ఉవే హూన్‌ గత జూన్‌లో వ్యాఖ్యానించారు. భారత్‌లో జావెలిన్‌ త్రోలో ఏదో మంచి చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. అయితే, సాయ్‌, ఏఎఫ్‌ఐతో కలిసి పనిచేయడం ఇబ్బందికరంగా ఉంది. ఇది వారి జ్ఞానమా లేక అజ్ఞానమా అనేది నాకు తెలియదని ఉవే హూన్‌ వ్యాఖ్యలు చేశారు. అథ్లెట్ల కోసం సప్లిమెంట్ల కోసం న్యూట్రిషనిస్ట్‌ అడిగినా పట్టించుకోలేదని.. క్రీడా మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీం అథ్లెట్లకు కూడా పోషకాలు అందేవి కాదని ఉవే హూన్‌ విమర్శలు చేశారు.

    Trending Stories

    Related Stories